హీరో నాగచైతన్య, హీరోయిన్‌ సాయి పల్లవి మళ్లీ జోడీగా ... | Sai Pallavi Joins With Naga Chaitanya For NC23 Movie - Sakshi
Sakshi News home page

హీరో నాగచైతన్య, హీరోయిన్‌ సాయి పల్లవి మళ్లీ జోడీగా ...

Published Thu, Sep 21 2023 1:12 AM | Last Updated on Thu, Sep 21 2023 4:02 PM

Sai Pallavi Once Again romance Naga Chaitanya in NC23 - Sakshi

హీరో నాగచైతన్య, హీరోయిన్‌ సాయి పల్లవి మళ్లీ జోడీగా కనిపించనున్నారు. ‘లవ్‌ స్టోరీ’ (2021) వంటి సూపర్‌ హిట్‌ చిత్రం తర్వాత ఈ ఇద్దరూ ‘ఎన్‌సీ 23’లో (వర్కింగ్‌ టైటిల్‌) మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు. చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకుడు.

అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించనున్న ఈ సినిమా ప్రీప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నట్లు బుధవారం మేకర్స్‌ ప్రకటించారు. ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కనున్న చిత్రమిది. నాగచైతన్య, చందు మొండేటి కెరీర్‌లో భారీ బడ్జెట్‌ చిత్రం అవుతుంది. త్వరలోనే షూటింగ్‌ ్ర΄ారంభిస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement