రిస్క్‌ తీసుకొని హర్‌ చేశా | Sakshi
Sakshi News home page

రిస్క్‌ తీసుకొని హర్‌ చేశా

Published Mon, Jul 10 2023 3:48 AM

Ruhani Sharma's HER Trailer Launch - Sakshi

‘‘హర్‌’ సినిమా నా దగ్గరికి వచ్చినప్పుడు ఫీమేల్‌ ఓరియంటెడ్‌ మూవీ నేను చేయగలనా? అని ఒక అనుమానం ఉండేది. కానీ డైరెక్టర్‌ శ్రీధర్‌గారు నాకు నమ్మకం ఇచ్చారు. రిస్క్‌ తీసుకొని మరీ ఈ సినిమా చేశాను’’ అని హీరోయిన్‌ రుహాని శర్మ అన్నారు. శ్రీధర్‌ స్వరాఘవ్‌ దర్శకత్వంలో రుహాని శర్మ లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘హర్‌’. డబుల్‌ అప్‌ మీడియాస్‌పై రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు.

సురేష్‌ మూవీస్‌ ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ ద్వారా ఈ నెల 21న ఈ మూవీ విడుదలవుతోంది. ఈ మూవీ ట్రైలర్‌ని హీరో వరుణ్‌ తేజ్‌ వర్చువల్‌గా లాంచ్‌ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌కి నిర్మాత రాజ్‌ కందుకూరి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ–‘‘హర్‌’ నేను ఇప్పటికే చూశాను.. సినిమా చాలా బాగుంది. తప్పకుండా మంచి హిట్‌ అవుతుంది’’ అన్నారు. శ్రీధర్‌ స్వరాగవ్‌ మాట్లాడుతూ– ‘‘మా సినిమా మొదటి సీన్‌ నుంచి చివరి వరకు ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement