
కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం కాంతార చాప్టర్-1. ఈ మూవీని కాంతారకు ప్రీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ ఏడాది దసరా కానుకగా థియేటర్లలో సందడి చేసేందుకు అంతా సిద్ధమైంది. దీంతో కాంతార మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు. ఇటీవల హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. తాజాగా ముంబయిలోనూ బిగ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.
(ఇది చదవండి: కాంతార చాప్టర్ 1 లాంటి సినిమా చేయడం సులభం కాదు: ఎన్టీఆర్)
అయితే మంగళవారం చెన్నైలో కాంతార చాప్టర్-1 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఇటీవల జరిగిన కరూర్ ఘటన నేపథ్యంలో కాంతార నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ దురదృష్టకర సంఘటన కారణంగా రేపు చెన్నైలో జరగాల్సిన ప్రమోషనల్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఈ ఘటనతో ప్రభావితమైన వారి కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు అభిమానులకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. సరైన సమయంలో తమిళనాడు ప్రేక్షకులను కలవడానికి మేము ఎదురుచూస్తున్నామని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Due to the recent unfortunate incident, we are cancelling the #KantaraChapter1 promotional event in Chennai tomorrow.
Our thoughts and prayers are with those affected.
Thank you for your understanding, we look forward to meeting our audience in Tamil Nadu at a more appropriate… pic.twitter.com/ROhmiu6glR— Hombale Films (@hombalefilms) September 29, 2025