Rashmika Mandanna Responded On Dating Rumours With Vijay Devarakonda - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: మా ఇద్దరికి మ్యూచ్‌వల్ ఫ్రైండ్స్ ఉన్నారు: రష్మిక

Oct 1 2022 5:55 PM | Updated on Oct 1 2022 6:37 PM

Rashmika Mandanna Responded On Dating Rumours With Vijay Devarakonda - Sakshi

రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ కాంబినేషన్ టాలీవుడ్‌లో సక్సెస్ జోడీగా నిలిచింది. ఈ జంట గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో కలిసి నటించింది. ఆన్‌ స్క్రీన్‌పై వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. గతంలో  ఈ జోడీపై డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్లు వచ్చాయి. అభిమానుల్లో ఉన్న రూమర్స్‌పై రష్మిక మందన్నా స్పందించారు. ‍ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాటిపై ప్రశ్నించగా ఆమె సమాధానమిచ్చారు.

రష్మిక మందన్నా మాట్లాడుతూ  'విజయ్, నేను కలిసి నటించాం. మా కెరీర్‌లో చాలా తొందరగా ఎదిగాం. పరిశ్రమలో అందరితో కలిసి పని చేయాలి. వారిలో కొందరు స్నేహితులుగా మారతారు. నాకు హైదరాబాద్‌లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అతనికి కూడా హైదరాబాద్‌లో గ్యాంగ్ ఉంది. ఇండస్ట్రీలో మా ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇలాంటి వార్తలు విన్నప్పుడు అయ్యో బాబు చాలా క్యూట్‌గా ఉంటాయి అనిపిస్తుంది.  మా కోసం ఏదైనా కథ ఉంటే కచ్చితంగా చేస్తాం. మేమిద్దరం మంచి నటులం. దర్శకులను నిరాశపర్చం' అని అన్నారు.

(చదవండి: కార్తితో మరోసారి జోడి కట్టబోతున్న రష్మిక మందన్నా)

కాగా.. రష్మిక 'గుడ్‌ బై' చిత్రం ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆమె 'గుడ్‌బై' ప్రమోషన్లలో బిజీగా ఉంది. బిగ్‌బీ అమితాబ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 7న విడుదల కానుంది. రష్మిక తదుపరి తమిళ చిత్రం వారిసులో కనిపించనుంది. బాలీవుడ్‌లో రణబీర్ కపూర్‌తో కలిసి యానిమల్ సినిమాలో నటించనుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement