‘‘నా జీవితంలో జరిగిన ప్రతి విషయం నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను’’ అని హీరోయిన్ రష్మికా మందన్నా(Rashmika Mandanna ) అంటున్నారు. నటిగా తన కథల ఎంపిక, పారితోషికం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు రష్మిక. ఆమె మాట్లాడుతూ–‘‘హీరోయిన్‌గా ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే నా పని. ఎలాంటి భాషాపరమైన హద్దులు లేకుండా, అందరికీ నచ్చే చిత్రాలు చేయడానికే ప్రయత్నిస్తుంటాను. కొంతమంది ప్రేక్షకులకు లవ్‌స్టోరీ సినిమాలు ఇష్టం. ఇంకొంతమంది వాణిజ్య చిత్రాలను ఇష్టపడతారు. అందుకే కమర్షియల్, లవ్ స్టోరీ, ఉమెన్ సెంట్రిక్... ఇలా విభిన్న రకాల జానర్స్‌లో సినిమాలు చేస్తున్నాను.
(చదవండి: నా ఫోటోలు జూమ్ చేసి చూశారు.. దర్శకుడిపై 'ఈషా రెబ్బా')
ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం కోసమే వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్నాను. ఇకపై కూడా ఇలానే ముందుకు సాగుతాను. ఇక స్పెషల్ సాంగ్స్ చేయడంపైనా నాకు ఆసక్తి ఉంది. కాకపోతే ఆ చిత్రంలో నేనే హీరోయిన్ గా ఉండాలి. లేదంటే.. ఇండస్ట్రీలో ఉన్న ఓ నలుగురు డైరెక్టర్స్ సినిమాల్లో మాత్రం లీడ్ రోల్ కాకపోయినా స్పెషల్ సాంగ్ చేస్తాను. అలాగే ఇండస్ట్రీలో ఎక్కువ పారితోషికం తీసుకునే నటిని నేనే అనుకుంటున్నారు.. అయితే ఇది నిజం కాదు. కానీ, అది నిజం కావాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.


