నా ఫోటోలు జూమ్‌ చేసి చూశారు.. దర్శకుడిపై 'ఈషా రెబ్బా' | Actress Eesha Rebba Comments on body shamed by a Film Director | Sakshi
Sakshi News home page

నా ఫోటోలు జూమ్‌ చేసి చూశారు.. దర్శకుడిపై 'ఈషా రెబ్బా'

Jan 20 2026 8:44 AM | Updated on Jan 20 2026 8:52 AM

Actress Eesha Rebba Comments on body shamed by a Film Director

తెలుగు నటి ఈషా రెబ్బా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్‌ ప్రారంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకుంది. సోషల్‌మీడియా నుంచి హీరోయిన్‌గా ఎదిగిన ఈ బ్యూటీ.. ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన తన ఫోటోలను చూసి దర్శకుడు  ఇంద్రగంటి మోహన కృష్ణ తొలి ఛాన్స్‌ ఇచ్చారు. ఆ తర్వాత అరవింద సమేత, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్, ఓయ్‌, సవ్యసాచి, 3 రోజెస్ వంటి ప్రాజెక్ట్‌లతో ఆలరించింది. తాజాగా తన నటించిన ఓం శాంతి శాంతి శాంతిః మూవీ జనవరి 30న విడుదల కానుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.  

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈషా రెబ్బా(Eesha Rebba) తన కలర్‌ గురించి ఎదుర్కొన ఘటనను గుర్తు చేసుకుంది. 'ఒక సినిమా కోసం నేను ఫోటో షూట్‌లో పాల్గొన్నాను. అయితే, దర్శకుడు నా ఫోటోలను చాలా జూమ్‌ చేసి మోచేతులు నల్లగా ఉన్నాయని, మరింత అందంగా ఉండాలని కోరారు.. ఆయన మాటలు నన్ను బాధపెట్టాయి. చాలా నిరూత్సాహం చెందాను.

ఆ సమయంలో ఆయనకు ఏ సమాధానం ఇవ్వాలనేది కూడా తెలియలేదు.  నా పుట్టుకతో వచ్చిన రంగును ఎలా మార్చుకోగలమని చెప్పాను. పరిశ్రమలో ఇలాంటివి సాధారణంగా జరుగుతుంటాయని ఆప్పట్లో నాకు తెలీదు.  అయితే, ఆయన వ్యాఖ్యలతో నేను కూడా మరింత కలర్‌గా ఉంటే బాగుండేదేమో అనిపించింది. కానీ, వారి కోసం నా కలర్‌ను మార్చుకోలేను కదా.. ఆ సమయం నుంచి మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం నేర్చుకున్నాను.' అని గుర్తుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement