రష్మిక.. ఎప్పుడూ జిమ్‌లోనే ఉంటావా? | Rashmika Gym Workout Video Reacts Kriti Sanon | Sakshi
Sakshi News home page

Rashmika: తోటి హీరోయిన్‌కి షాకిచ్చిన రష్మిక.. వీడియో వైరల్

Sep 29 2025 2:53 PM | Updated on Sep 29 2025 3:46 PM

Rashmika Gym Workout Video Reacts Kriti Sanon

పాన్ ఇండియా లెవల్లో ప్రస్తుతం బిజీ యాక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది రష్మిక మాత్రమే. ఎందుకంటే ఓవైపు ప్రాంతీయ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు బాలీవుడు మూవీస్ కూడా చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. సరే ఇదంతా పక్కనబెడితే రష్మిక గురించి తోటి హీరోయిన్ ఓ ఫన్నీ వీడియో పోస్ట్ చేసింది. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: రష్మిక గ్లామరస్‌ సాంగ్‌ విడుదల)

ఈ ఏడాది ఛావా, సికిందర్, కుబేర చిత్రాలతో వచ్చింది. వీటిలో రెండు హిందీ మూవీస్. వచ్చే నెలలో 'థామా' అనే బాలీవుడ్ హారర్ సినిమాతో రాబోతుంది. ఇది కాకుండా 'గర్ల్ ఫ్రెండ్' అనే తెలుగు చిత్రం కూడా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఇవి కాకుండా 'కాక్ టెయిల్ 2' అనే హిందీ మూవీ కూడా చేస్తోంది. ఇందులో రష్మికతో పాటు కృతి సనన్ హీరోయిన్‌గా చేస్తోంది. తాజాగా వీళ్లిద్దరూ ఓ జిమ్‌లో కలిశారు. అయితే కృతి అక్కడకి వెళ్లడానికంటే ముందే రష్మిత వర్కౌట్స్ చేస్తూ కనిపించింది.

'రష్మిక నువ్వు ఎప్పుడు చూసినా జిమ్‌లోనే కనిపిస్తున్నావ్. కొంపదీసి ఇక్కడే బతికేస్తున్నావా?' అని కృతి సనన్ నవ్వుతూ అడగ్గా.. బదులిచ్చిన రష్మిక.. 'నువ్వు వచ్చేటప్పుడు నేను ఇక్కడ ఉంటున్నాను. ఎక్కువగా ఏం చేయడం లేదు' అని నవ్వేసింది. 'నువ్వు చాలా కష్టపడుతున్నావ్' అని కృతి సనన్ అనేసరికి వీళ్లిద్దరూ గట్టిగా నవ్వేసుకున్నారు. ఈ వీడియోని కృతి సనన్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: విషాదం.. 'వీర్ హనుమాన్' బాల నటుడు మృతి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement