అతడి పెళ్లిలో రష్మిక.. కొత్తజంట అలా చేయడంతో! | Sakshi
Sakshi News home page

Rashmika: సామాన్యుడి పెళ్లికొచ్చిన హీరోయిన్ రష్మిక!

Published Sun, Sep 3 2023 5:11 PM

Rashmika Attend Her Assistant Wedding Hyderabad - Sakshi

స్టార్ హీరోయిన్ రష్మిక.. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా  ఉంటుంది. అలాంటి ఆమె హైదరాబాద్‌లో జరిగిన ఓ పెళ్లిలో సందడి చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఇంతకీ ఎవరతడు? అసలు రష్మిక ఈ పెళ్లిలో ఏం చేసింది?

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ స్టేజీపై సమంత కోసం ఆరా తీసిన నాగార్జున)

స్టార్ హీరోయిన్లు అన్న తర్వాత వాళ్లకు ఓ టీమ్ కచ్చితంగా ఉంటుంది. హెయిర్, మేకప్, డ్రస్సింగ్ కోసం అసిస్టెంట్స్ ఉంటారు. చాలామంది బ్యూటీస్ వాళ్లని సహాయకులుగా కంటే ఓ ఫ్యామిలీలా చూసుకుంటూ ఉంటారు. అలా రష్మిక.. తాజాగా హైదరాబాద్ లో జరిగిన తన అసిస్టెంట్ పెళ్లికే హాజరైంది. ఆరెంజ్ కలర్ చీరలో అలా మెరిసిపోయింది.

అయితే ఈ పెళ్లిలో అంతా ఓకే గానీ నూతన వధూవరులు ఇద్దరూ రష్మిక ఆశీర్వాదం తీసుకున్నారు. కానీ ఈమెకి అప్పుడేం చేయాలో అర్థం కాలేదు. దీంతో సిగ్గుతో ఉబ్బితబ్బిబ్బి అయిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్స్ కి నవ్వు తెప్పిస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం పుష్ప 2, యానిమల్ అనే పాన్ ఇండియా సినిమాల‍్లో రష్మిక నటిస్తోంది. ఈ రెండు వచ్చే ఏడాది థియేటర్లలోకి రాబోతున్నాయి. 

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో.. ఫోటోలు వైరల్!)

Advertisement
Advertisement