వివాహబంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరో..! | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో.. ఫోటోలు వైరల్!

Published Sun, Sep 3 2023 11:56 AM

Konda Movie hero Thrigun Get Married Niveditha Today - Sakshi

కథ అనే సనిమాతో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన నటుడు త్రిగుణ్. అలాగే ఆర్జీవి తెరకెక్కించిన కొండా చిత్రంతో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు తెలుగు ప్రేక్షకులందరికి చాలా దగ్గరయ్యారు. తాజాగా ఈ హీరో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. బంధుమిత్రుల సమక్షంలో నివేదిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. తమిళనాడు తిరుపురులో జరిగిన వీరి పెళ్లికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. 

(ఇది చదవండి: అవార్డులు నాకు చెత్తతో సమానం.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్! )

చెన్నైలో పుట్టి పెరిగిన త్రిగుణ్ కథ అనే చిత్రంతో వెండితెరపైకి అడుగుపెట్టారు. ఆ తర్వాత త్రిగుణ్ పలు సినిమాల్లో నటించారు. వైవిధ్యభరితమైన కథలతో తన సినీ  ప్రయాణాన్ని కొనసాగించారు. రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘కొండా’ చిత్రంతో ఫేమస్ అయ్యాడు. పీవీఎస్ గరుడ వేగ, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, డియర్ మేఘ, చీకటి గదిలో చితక్కొట్టుడు, ప్రేమదేశం, కథ కంచికి.. మనం ఇంటికి,  తుంగభద్ర, 24 కిస్సెస్, కిరాయి, లైన్‌మెన్‌ లాంటి చిత్రాల్లో నటించారు. త్రిగుణ్ ప్రస్తుతం తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తున్నారు.

(ఇది చదవండి: స్టార్ హీరో సినిమాకు ఓకే చెప్పిన విజయేంద్ర ప్రసాద్.. పాన్‌ ఇండియా రేంజ్‌లో!)

Advertisement
 
Advertisement
 
Advertisement