Ranveer Singh and Deepika Padukone Share a Kiss at The Song Launch - Sakshi
Sakshi News home page

Ranveer Singh and Deepika Padukone: వేదికపైనే బాలీవుడ్ జంట రొమాన్స్.. పిక్స్ వైరల్

Dec 8 2022 4:08 PM | Updated on Dec 8 2022 5:57 PM

Ranveer Singh and Deepika Padukone share a kiss at the song launch  - Sakshi

బాలీవుడ్ ప్రేమజంట రణ్‌వీర్‌ సింగ్, దీపికా పదుకొణె నటనతో ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేశారు. 2018లో వివాహబంధంతో ఒక్కటయ్యారు ఈ జంట. తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో ఈ ప్రేమజంట రెచ్చిపోయింది. ఓ సాంగ్ రిలీజ్ ఫంక్షన్‌లో వేదికపైనే ముద్దుల్లో మునిగిపోయారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 

రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె జంటగా తాజాగా నటించిన చిత్రం 'సర్కస్'. తాజాగా ఈ చిత్రంలోని 'కరెంట్ లగా రే' అనే పాటను  ముంబయిలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ పవర్ కపుల్స్ వారి ప్రేమను ఆపుకోలేకపోయారు. వేదికపైనే ముద్దుల్లో మునిగితేలారు. ప్రస్తుతం రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న  చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో దీపికా పదుకొణె పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌కు జోడిగా 'ప్రాజెక్ట్‌ కె' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. 

రోహిత్ శెట్టి మూవీ సర్కస్ విలియం షేక్స్‌పియర్ నాటకం ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రంలో వరుణ్ శర్మ, పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సిద్ధార్థ జాదవ్, జానీ లివర్, సంజయ్ మిశ్రా, వ్రజేష్ హిర్జీ తదితరులు నటించారు. డిసెంబర్ 23న ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement