మాయ నాలో జరిగెనే! | Rangabali movie second song launch | Sakshi
Sakshi News home page

మాయ నాలో జరిగెనే!

Jun 20 2023 3:35 AM | Updated on Jun 20 2023 3:35 AM

Rangabali movie second song launch - Sakshi

‘అందరిలోనూ ఒక్కడు కాను... నేను వేరే తీరులే, కలిసే తాను.. వెలిగే మేను.. మాయ నాలో జరిగెనే...’ అంటూ మొదలవుతుంది ‘కల కంటూ ఉంటే..’ అనే పాట. నాగశౌర్య, యుక్తితరేజ జంటగా నటించిన ‘రంగ బలి’ చిత్రంలోని పాట ఇది.

పవన్‌ బాసంశెట్టి దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం జూలై 7న విడుదల కానుంది. పవన్‌ సీహెచ్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘కల కంటూ ఉంటే..’ అంటూ సాగే పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. కృష్ణకాంత్‌ సాహిత్యం అందించిన ఈ పాటను సార్థక్‌ కల్యాణి, వైష్‌ ఆలపించారు. సత్య, సప్తగిరి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు కెమెరా: దివాకర్‌ మణి.

Advertisement
 
Advertisement
Advertisement