తెలుగులో బోలెడంత మంది యూట్యూబర్లు ఉన్నారు. రోజువారీ దైనందిన విషయాల గురించి ప్రతిరోజూ వీడియోలు చేస్తూ 'ఏ జూడ్' అనే ఛానెల్తో అజయ్ అనే యూట్యూబర్ గుర్తింపు తెచ్చుకున్నాడు. గత రెండు వారాలుగా ఎలాంటి వీడియోలు గానీ పోస్టులు గానీ పెట్టని ఇతడు.. సడన్గా హీరో అయిపోయాడు. శనివారమే ఇతడి మూవీ లాంచ్ అయింది.
(ఇదీ చదవండి: 'జైలర్ 2' సినిమాలో షో స్టీలర్.. ఎవరీ మూర్తి?)
హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. రాము కొప్పుల దర్శకత్వంలో నెక్సస్ శ్రీధర్, దీపక్ ముస్త్యాల నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నాడు. యూట్యూబ్ కమ్యునిటీ నుంచి వచ్చి హీరో అయినవాళ్లలో ఏ జూడ్ మొదటివాడేం కాదు. లిటిల్ హార్ట్ ఫేమ్ మౌళి, సుహాస్, సుమంత్ ప్రభాస్ తదితరులు.. యూట్యూబ్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కుకున్నవాళ్లే. మరి వీళ్లలా అజయ్ అలియాస్ ఏ జూడ్ సక్సెస్ అవుతాడా లేదా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ హీరోయిన్)


