second son
-
ఇరాన్ నూతన సారథి మొజ్తబా!
దుబాయ్: ఇరాన్ నూతన సుప్రీం నేతగా అయతొల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబా హొసేనీ ఖమేనీ నియుక్తులైనట్టు తెలుస్తోంది. 88 మంది మతపెద్దలతో కూడిన కమిటీ (అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్) మంగళవారం ఆయనను ఎన్నుకున్నట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఇరాన్ ఇంటర్నేషనల్ వార్తా సంస్థ బుధవారం ఈ మేరకు పేర్కొంది. దీన్ని ఇరాన్ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై గత శనివారం ఇజ్రాయెల్, అమెరికా జరిపిన భీకర దాడుల్లో ఖమేనీ మరణించడం తెలిసిందే. 56 ఏళ్ల మొజ్తబా ఆయన రెండో కుమారుడు. ఆయనకు పాలనానుభవమేదీ లేదు. ఇప్పటిదాకా తెర వెనకే తండ్రి తరఫున వ్యవహారాలను చక్కబెడుతూ వచ్చారు. వారసత్వ రాజకీయాలకు ప్రస్తుత ఇరాన్ పాలక వర్గం పూర్తిగా వ్యతిరేకమన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో మొజ్తబా ఎన్నికపై కమిటీలో పలువురు అభ్యంతరం వెలిబుచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇరాన్లో సర్వశక్తిమంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) తీవ్ర ఒత్తిడితో చివరికి ఆయన నియామకానికి పచ్చజెండా ఊపినట్టు ఇరాన్ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఐఆర్జీసీపై మొజ్తబాకు పూర్తిస్థాయిలో పట్టుంది. దాని వ్యవహారాలను చాలా ఏళ్లుగా పూర్తిగా ఆయనే చూసుకుంటున్నట్టు చెబుతారు. వారసత్వ పాలనను వ్యతిరేకిస్తూ రాచరికాన్ని కూలదోసిన 1979 నాటి ఇస్లామిక విప్లవంలో ఖమేనీ కీలక పాత్ర పోషించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు వారసత్వంగా పాలన పగ్గాలు చేపట్టడాన్ని ఇరాన్ ప్రజలు ఏ మేరకు ఆమోదిస్తారన్నది చూడాలి. ఇరాన్లో అధ్యక్షునిగా ఎవరున్నా సర్వం సహా అధికారాలు మాత్రం సుప్రీం నేత చెప్పుచేతల్లోనే ఉంటాయి. సైన్యంతో పాటు అత్యంత శక్తిమంతమైన ఐఆర్జీసీ కూడా పూర్తిగా ఆయన కనుసన్నల్లోనే పని చేస్తుంది. శనివారం నాటి దాడుల్లో 86 ఏళ్ల ఖమేనీతో పాటు మొజ్తబా భార్య జహ్రా హదద్ ఆదెల్, ఆయన చిన్న కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మొజ్తబా ఒక్కసారి కూడా బహిరంగంగా కని్పంచలేదు. ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో అజ్ఞాతంలో ఉంటూ ఇరాన్ ప్రతి దాడులను పర్యవేక్షిస్తున్నట్టు చెబుతున్నారు. తెర వెనక ‘సుప్రీం’మొజ్తబా. అయతొల్లా ఖమేనీ రెండో కుమారునిగానే తప్ప బయటి ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని పేరు. అయితే తెర వెనక మాత్రం దశాబ్దాలుగా ఆయన పూర్తిస్థాయి అధికారాలు చలాయిస్తూ వస్తున్నట్టు చెబుతారు. ఒకరకంగా రాజకీయ, ఆర్థిక, భద్రతా వ్యవహారాలన్నింటినీ శాసించారంటారు. ఆ క్రమంలో ఖమేనీ వారసునిగా చాలా ఏళ్లుగా మొజ్తబా పేరే వినిపిస్తోంది. ఆయన్ను సుప్రీం నేతగా నియమిస్తున్నట్టు ఏడాది క్రితమే వార్తలొచ్చినా అప్పట్లో అది కార్యరూపం దాల్చలేదు. ఇరాన్ రాజకీయ వ్యవహారాల్లో మొజ్తబా ‘అదృశ్య శక్తి’గానే ఉంటూ వస్తున్నారు. ఆయన 1969లో మషాద్ నగరంలో జని్మంచారు. నాటి పాలకుడు మహమ్మద్ రెజా పహ్లావీ పాలనపై తన తండ్రి ఖమేనీ తిరుగుబాటును చూస్తూ పెరిగారు. కోమ్ నగరంలో షియా మత విద్య అభ్యసించినా క్లెరికల్ హోదాతో సరిపెట్టుకున్నారు. కీలకమైన ఆయతుల్లా హోదాకు చేరలేకపోయారు. పహ్లవీ పాలన అంతమయ్యాక తన తండ్రి ఖమేనీ ఇరాన్ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదుగుతున్న క్రమంలోనే మొజ్తబా సైన్యంలో చేరారు. ఇరాక్‌పై పోరులో ఐఆర్జీసీ విభాగమైన హబీబ్ ఇబ్న్ మజాహిర్ బెటాలియన్‌కు సారథ్యం వహించారు. అక్కణ్నుంచీ ఐఆర్‌జీసీతో ఆయన బంధం బలంగా పెనవేసుకుంటూ వచ్చింది. 1989లో ఖమేనీ సుప్రీం లీడర్ అయ్యాక మొజ్తబా ప్రాధాన్యం విస్తరిస్తూ వచ్చింది. ముఖ్యంగా ఇరాన్ వ్యాపార వ్యవహారాలను పూర్తిగా ఆయనే నియంత్రిస్తూ వచ్చారు. ఆ క్రమంలో ఇంటా బయటా బిలియన్ల కొద్దీ డాలర్ల ఆస్తులు కూడబెట్టారంటారు. 2000 నాటి వికీలీక్స్ కూడా మొజ్తబానే ఇరాన్లో నిజమైన అధికార శక్తిగా పేర్కొంది. 2019లో ట్రంప్ తొలి హయాంలో మొజ్తబాపై అమెరికా కఠిన ఆంక్షలు విధించింది. 2005లో తనకు అనుకూలుడైన మతవాది అహ్మదీ నెజాద్ అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గేలా మొజ్తబా పావులు కదిపినట్టు చెబుతారు.సుప్రీం నేతగా ఎవరు ఎన్నికైనా అంతం చేసేస్తాం: ఇజ్రాయెల్ జెరూసలేం: ఇరాన్ సుప్రీం నేతగా ఎవరు ఎన్నికైనా తక్షణమే అంతం చేసేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ మేరకు సైన్యానికి ఇప్పటికే పూర్తిస్థాయి ఆదేశాలిచ్చినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ బుధవారం తెలిపారు. తమ అంతమే లక్ష్యంగా పని చేసే అలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే ఉండబోదని పేర్కొన్నారు. -
అప్పుడే రెండేళ్లు అయిపోయాయా కన్నమ్మా.. లాస్య ఎమోషనల్ (ఫోటోలు)
-
యాంకర్ లాస్య రెండో కుమారుడి బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
Actor Vishwa: బిగ్‌బాస్ కంటెస్టెంట్ విశ్వ రెండో కుమారుడి అన్నప్రాసన (ఫోటోలు)
-
మాయ నాలో జరిగెనే!
‘అందరిలోనూ ఒక్కడు కాను... నేను వేరే తీరులే, కలిసే తాను.. వెలిగే మేను.. మాయ నాలో జరిగెనే...’ అంటూ మొదలవుతుంది ‘కల కంటూ ఉంటే..’ అనే పాట. నాగశౌర్య, యుక్తితరేజ జంటగా నటించిన ‘రంగ బలి’ చిత్రంలోని పాట ఇది. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం జూలై 7న విడుదల కానుంది. పవన్ సీహెచ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘కల కంటూ ఉంటే..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ పాటను సార్థక్ కల్యాణి, వైష్ ఆలపించారు. సత్య, సప్తగిరి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు కెమెరా: దివాకర్ మణి. -
ఇవాళే కలిశారు తొలిసారిగా..
నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ కానుంది. కళ్యాణీ మాలిక్ సంగీతం అందించారు. ఈ చిత్రం నుంచి ‘ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయ్.. ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయ్.. ఇవాళే కలిశారు తొలిసారిగా..’ అంటూ సాగే రెండో పాటని సోమవారం విడుదల చేశారు. గాయని నూతన మోహన్, కళ్యాణీ మాలిక్ పాడిన ఈ పాటకి భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించారు. ‘‘హీరో, హీరోయిన్ల పరిచయ గీతం ఇది. ఈ చిత్రంలో మూడు పాటలు రాశాను’’ అన్నారు భాస్కరభట్ల రవికుమార్. ఈ చిత్రానికి సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, కెమెరా: సునీల్ కుమార్ నామ, సంగీతం: కళ్యాణీ మాలిక్, వివేక్ సాగర్ (కాఫీఫై సాంగ్). -
వైరల్: కరీనా కపూర్ రెండో కుమారుడి ఫోటో లీక్!
బాలీవుడ్ స్టార్స్ కరీనా కపూర్-సైఫ్ అలీఖాన్ జంట ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తొలి సంతానం తైమూర్ కాగా, రెండో బిడ్డకు ‘జెహ్’ అని నామకరణం చేశారు. అయితే ఇప్పటివరకు జెహ్‌కు సంబంధించి ఫోటోను చూపించలేదు. తైమూర్ అడపాదపడా మీడియా కంటికి చిక్కినా.. రెండో కుమారుడు ‘జెహ్’ను మీడియా కంటికి చిక్కకుండా కరీనా జంట జాగ్రత్త పడుతూ వచ్చారు. తాజాగా జెహ్ ఫోటో ఒకటి బయటికొచ్చింది. ఇటీవలీ కరీనా తన ప్రగ్నెన్సీ అనుభవాన్ని పుస్తకం రూపంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ బుక్కు ఆమె ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రగ్నెన్సీ బైబిల్’ అనే టైటిల్‌తో విడుదల చేసింది. ఈ పుస్తకంలోని ఒక పేజీలో కరీనా చిన్నారిని ముద్దుచేస్తున్నట్లు ఒక ఫోటో ఉంది. అయితే ఇందులో కనిపిస్తుంది కరీనా రెండో కుమారుడు 'జెహ్' అని ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీనిపై పటౌడీ ఫ్యామిలీ మాత్రం ఇంకా స్పందించలేదు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఇది జెహ్ ఫోటోనే అని ఫిక్సయిపోయి ఈ ఫోటోను తెగ షేర్ చేసేస్తున్నారు. ఇదిలా ఉండగా నటుడు సైఫ్ అలీఖాన్ గతంలో అమృత సింగ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరి సంతానమే సారా అలీఖాన్, ఇబ్రహీమ్ అలీఖాన్. అయితే ఆమెతో విడిపోయిన తర్వాత సైఫ్ 2012లో కరీనాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి 2016 డిసెంబర్లో తైమూర్ జన్మించగా, సుమారు ఐదేళ్ల గ్యాప్ తర్వాత జెహ్ పుట్టాడు. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) -
స్క్రీన్ ప్లే 4th July 2018
-
హీరో - హీరోయిన్ జంటకు రెండో కొడుకు
బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్, హీరోయిన్ జెనీలియా డిసౌజా జంటకు మళ్లీ కొడుకు పుట్టాడు. ఇంతకుముందే వీళ్లకు రియాన్ అనే ఒక కొడుకు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు రెండోసారి కూడా కొడుకు పుట్టాడు. ఈ విషయాన్ని రితేష్ దేశ్‌ముఖ్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపాడు. తన పెద్దకొడుకు రియాన్‌కు ఇప్పుడు ఓ తమ్ముడు పుట్టాడని చెప్పాడు. ''హే గయ్స్, మా ఆయి, బాబా (అమ్మ, నాన్న) నాకు ఇప్పుడే ఓ చిన్నారి తమ్ముడిని బహుమతిగా ఇచ్చారు. ఇక నా బొమ్మలన్నీ వాడివే.. రియాన్'' అంటూ తన పెద్ద కొడుకు చెబుతున్నట్లుగా రితేష్ ట్వీట్ చేశాడు. వెంటనే బాలీవుడ్ ప్రముఖులంతా ఒకరి తర్వాత ఒకరుగా రితేష్ - జెనీలియా జంటకు తమ అభినందనలు తెలిపారు. హుమా ఖురేషి, బొమ్మన్ ఇరానీ, అదితి రావు హైదరీ, రాజ్‌నాయక్, బాబా సెహగల్, సచిన్ జోషి, కమాల్ ఆర్ ఖాన్, వరుణ్ ధావన్, ఆలియా భట్... ఇలా చాలామంది రితేష్, జెనీలియాలను అభినందించారు. Hey guys, my Aai & Baba just gifted me a little brother. Now all my toys are his...- Love Riaan pic.twitter.com/H8JSKE0A3d — Riteish Deshmukh (@Riteishd) 1 June 2016


