హీరో రామ్ కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘హ్యాష్‌టాగ్‌ఆర్‌ఏపీఓ23 (వర్కింగ్ టైటిల్)’. రామ్ సినిమాటిక్స్ పతాకంపై కృష్ణ పోతినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి పి. మురళీమోహన్ కెమెరా స్విచ్చాన్ చేయగా, రవికిషోర్ క్లాప్ ఇచ్చారు. ఈ షాట్‌కు రామ్ స్వయంగా దర్శకత్వం వహించారు.
‘‘ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ని సోమవారం హైదరాబాద్ శివార్లలో ప్రారంభించాం. హీరో రామ్ పోతినేనితో పాటు ప్రధాన తారాగణం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమాకు కథ అందించి, హీరోగా, దర్శకుడిగా బాధ్యతలు స్వీకరించారు రామ్. ఆయన కెరీర్‌లోనే అత్యంత సవాల్‌తో కూడిన పాత్రను చేస్తున్నారు. అలాగే రామ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూ పొందిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు కెమెరా: తిరునావుకరసు.


