
రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అనుభవించు రాజా’. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కషీప్‌ఖాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుప్రియ యార్లగడ్డ నిర్మాత. ఇటీవలే ఈ సినిమా నుంచి రాజ్ తరుణ్ ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. ఆ లుక్‌లో జాతర కోలాహలం మధ్య, కోడితో కలిసి పందేనికి సిద్ధమవుతున్నట్టుగా కనిపించాడు రాజ్ తరుణ్. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ని వదలింది చిత్రం బృందం. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ టీజర్ విడుదలైంది.
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ఇదని టీజర్ చూస్తే అర్థమవుతంది. కోడి పందాలు ఆడే వ్యక్తిగా హీరో కనించబోతున్నాడు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా, ఫన్ పండించే డైలాగ్స్ తో ట్రైలర్ ను కట్ చేశారు. ‘బంగారం గాడు ఊర్లో, వాడి పుంజు బరిలో ఉండగా ఇంకోకడు గెలవడం కష్టమే’అంటూ రాజ్ తరుణ్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకి సిద్ధమైందని సినీ వర్గాలు తెలిపాయి. పోసాని కృష్ణమురళి, ఆడుగలమ్ నరేన్, అజయ్ సుదర్శన్, టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ, రవికృష్ణ, భూపాల్ రాజు, అరియానా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.