breaking news
Anubhavinchu Raja
-
భీమవరంలో ‘అనుభవించు రాజా’ టీం సందడి
భీమవరం (ప్రకాశంచౌక్): ఈ నెల 26న విడుదలవుతున్న ‘అనుభవించు రాజా’ సినిమాను ఓటీటీలో కాకుండా థియేటర్లో చూసి ఆదరించాలని సినిమా హీరో రాజ్ తరుణ్ కోరాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా శుక్రవారం చిత్ర యూనిట్ భీమవరం వచ్చింది. ముందుగా ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో చిత్ర యూనిట్ విద్యార్థులతో ముచ్చటించింది. అనంతరం క్లాస్మో క్లబ్ లో జరిగిన సమావేశంలో హీరో మాట్లాడుతూ అనుభవించు రాజా సినిమా చక్కని ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులకు 100% వినోదాన్ని పంచుతుందన్నారు. సినిమా చిత్రీకరణ కూడా భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిందని చెప్పారు. చదవండి: Bigg Boss Telugu 5: ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చినా సన్నీనే ఎలిమినేట్ అవుతాడు! -
పండగంతా పాటలో కనిపించింది – నాగచైతన్య
రాజ్‌తరుణ్, కశిష్ ఖాన్ జంటగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనుభవించు రాజా’. అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి పతాకాలపై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రం టైటిల్ సాంగ్‌ను నాగచైతన్య విడుదల చేశారు. గోపీసుందర్ స్వరపరచిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా రామ్ మిర్యాల ఆలపించారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ – ‘‘ఈ పాట చూశాను.. బాగుంది. సినిమా కూడా చూశాను. జీవితాన్ని ఎంజాయ్ చేసే ఓ కుర్రాడి పాత్రను వినోదంగా చూపించారు. కోడి పందేలు, రికార్డింగ్ డ్యాన్సులు, సంక్రాంతి పండగ వాతావరణం టైటిల్ సాంగ్‌లో కనిపించాయి’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఆనంద్ రెడ్డి కర్నాటి వ్యవహరిస్తున్నారు. చదవండి: ఆహాలోకి లవ్‌స్టోరీ మూవీ, స్ట్రీమింగ్ అప్పటి నుంచే -
Anubhavinchu Raja: బంగారం గాడు ఊర్లో, వాడి పుంజు బరిలో ఉంటే..
రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అనుభవించు రాజా’. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కషీప్‌ఖాన్ హీరోయిన్గా నటిస్తోంది. సుప్రియ యార్లగడ్డ నిర్మాత. ఇటీవలే ఈ సినిమా నుంచి రాజ్ తరుణ్ ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. ఆ లుక్‌లో జాతర కోలాహలం మధ్య, కోడితో కలిసి పందేనికి సిద్ధమవుతున్నట్టుగా కనిపించాడు రాజ్ తరుణ్. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ని వదలింది చిత్రం బృందం. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ టీజర్ విడుదలైంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ఇదని టీజర్ చూస్తే అర్థమవుతంది. కోడి పందాలు ఆడే వ్యక్తిగా హీరో కనించబోతున్నాడు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా, ఫన్ పండించే డైలాగ్స్ తో ట్రైలర్ ను కట్ చేశారు. ‘బంగారం గాడు ఊర్లో, వాడి పుంజు బరిలో ఉండగా ఇంకోకడు గెలవడం కష్టమే’అంటూ రాజ్ తరుణ్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకి సిద్ధమైందని సినీ వర్గాలు తెలిపాయి. పోసాని కృష్ణమురళి, ఆడుగలమ్ నరేన్, అజయ్ సుదర్శన్, టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ, రవికృష్ణ, భూపాల్ రాజు, అరియానా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.