భీమవరంలో ‘అనుభవించు రాజా’ టీం సందడి

భీమవరం (ప్రకాశంచౌక్): ఈ నెల 26న విడుదలవుతున్న ‘అనుభవించు రాజా’ సినిమాను ఓటీటీలో కాకుండా థియేటర్లో చూసి ఆదరించాలని సినిమా హీరో రాజ్ తరుణ్ కోరాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా శుక్రవారం చిత్ర యూనిట్ భీమవరం వచ్చింది. ముందుగా ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో చిత్ర యూనిట్ విద్యార్థులతో ముచ్చటించింది. అనంతరం క్లాస్మో క్లబ్ లో జరిగిన సమావేశంలో హీరో మాట్లాడుతూ అనుభవించు రాజా సినిమా చక్కని ఎంటర్‌టైన్‌మెంట్ తో ప్రేక్షకులకు 100% వినోదాన్ని పంచుతుందన్నారు. సినిమా చిత్రీకరణ కూడా భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిందని చెప్పారు.
చదవండి: Bigg Boss Telugu 5: ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చినా సన్నీనే ఎలిమినేట్ అవుతాడు!
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు