Naga Chaitanya: రాజ్‌తరుణ్‌ ‘అనుభవించు రాజా’ టైటిల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేసిన నాగచైతన్య

Naga chaitanya Released Raj Tharun Anubhavinchu Raja Movie Song - Sakshi

రాజ్‌తరుణ్, కశిష్‌ ఖాన్‌ జంటగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనుభవించు రాజా’. అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి పతాకాలపై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రం టైటిల్‌ సాంగ్‌ను నాగచైతన్య విడుదల చేశారు. గోపీసుందర్‌ స్వరపరచిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా రామ్‌ మిర్యాల ఆలపించారు.

ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ – ‘‘ఈ పాట చూశాను.. బాగుంది. సినిమా కూడా చూశాను. జీవితాన్ని ఎంజాయ్‌ చేసే ఓ కుర్రాడి పాత్రను వినోదంగా చూపించారు. కోడి పందేలు, రికార్డింగ్‌ డ్యాన్సులు, సంక్రాంతి పండగ వాతావరణం టైటిల్‌ సాంగ్‌లో కనిపించాయి’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా ఆనంద్‌ రెడ్డి కర్నాటి వ్యవహరిస్తున్నారు.

చదవండి: ఆహాలోకి లవ్‌స్టోరీ మూవీ, స్ట్రీమింగ్‌ అప్పటి నుంచే

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top