Love Story Movie OTT Release Date Announced - Sakshi
Sakshi News home page

OTT: ఆహాలోకి లవ్‌స్టోరీ మూవీ, స్ట్రీమింగ్‌ అప్పటి నుంచే

Oct 11 2021 2:00 PM | Updated on Oct 11 2021 6:43 PM

OTT: Naga Chaitanya Love Story Movie Streaming On AHA On October 22nd - Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత తెరుచుకున్న థియేటర్లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మూవీ ‘లవ్‌స్టోరీ’. మహమ్మారి కాలంలో కూడా అధిక శాతం ప్రేక్షకులను థియేటర్లోకి రప్పించిన చిత్రంగా లవ్‌స్టోరీ మార్క్‌ తెచ్చుకుంది.  బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూళ్ల వర్షం కురిపించింది.  ఇందులో సాయి పల్లవి డ్యాన్స్‌, నాగ చైతన్య నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిన ఈ మూవీ వరుసగా సక్సెస్‌, మ్యాజికల్‌ సక్సెస్‌ మీట్‌ వేడుకులను కూడా జరుపుకుంది.  ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని బుల్లితెర ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఆహా దసరా కానుకగా తీపి కబురుఉ అందించింది.  

చదవండి: నన్ను ఎవరు గుర్తు పట్టడంలేదు, అందుకే ఈవెంట్స్‌కి రావట్లేదు: రవళి

ఈ సినిమాను ఆహాలో విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించి స్ట్రీమింగ్ డేట్‌ను కూడా వదిలారు నిర్వహకులు. అక్టోబర్ 22న ఆహాలో ‘లవ్ స్టోరీ’ సినిమా స్ట్రీమింగ్ కానుంది. సరిగ్గా సెప్టెంబర్ 4న థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా నాలుగు వారాలకు(నెల రోజుల) అనంతరం ఓటీటీలోకి రావడం విశేషం. థియేటర్లలో భారీ విజయం సొంతం చేసుకున్న ‘లవ్ స్టోరీ’ ఇక ఆహాలో ఏ స్టాయిలో విజయం సాధిస్తుందో చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement