Acharya: చరణ్‌ ఎంట్రీ అదిరిపోద్దట! | Ram Charan grand Entry In Acharya | Sakshi
Sakshi News home page

Acharya: చరణ్‌ ఎంట్రీ అదిరిపోద్దట!

May 25 2021 12:40 AM | Updated on May 25 2021 7:37 AM

Ram Charan grand Entry In Acharya - Sakshi

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’. ఇందులో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కీలక పాత్రల్లో రామ్‌చరణ్, పూజా హెగ్డే కనిపించనున్నారు. ఇందులో దేవాదాయ శాఖ ఉద్యోగిగా చిరంజీవి నటిస్తున్నారు. చరణ్‌ది పూర్తి స్థాయి నిడివి ఉన్న కీలక పాత్ర. దాదాపు 40 నిమిషాలు ఉంటుందని టాక్‌. ఇంటర్‌వెల్‌లో వచ్చే చరణ్‌ పాత్ర సెకండాఫ్‌ అంతా ఉంటుందని తెలిసింది.

సినిమా ద్వితీయార్ధంలో ఈ పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. అంతేకాదు.. ఈ సినిమాలో చరణ్‌ పాత్ర పరిచయ సన్నివేశం అదిరిపోతుందట. సెకండాఫ్‌లో ముఖ్యంగా చిరంజీవి, చరణ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయని సమాచారం. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌కి బ్రేక్‌ పడింది. ఇంకా రామ్‌చరణ్, పూజాలపై ఓ పాటను చిత్రీకరించాల్సి ఉంది. ఈ ఏడాది మే 13న విడుదల కావాల్సిన ఈ చిత్రం కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement