రామ్‌చరణ్‌కు జోడీగా..? | Ram Charan to collaborate with Samantha on RC17 | Sakshi
Sakshi News home page

రామ్‌చరణ్‌కు జోడీగా..?

Oct 25 2024 3:38 AM | Updated on Oct 25 2024 3:16 PM

Ram Charan to collaborate with Samantha on RC17

‘రంగస్థలం’ (2018) తర్వాత హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సుకుమార్‌ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. రామ్‌చరణ్‌ కెరీర్‌లోని ఈ 17వ సినిమాను ఈ ఏడాది మార్చిలో ప్రకటించారు. అయితే ఈ సినిమా చిత్రీకరణను వచ్చే ఏడాది చివర్లోప్రారంభించాలనుకుంటున్నారని సమాచారం.

అంతేకాదు... ‘రంగస్థలం’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సమంత ఈ సినిమాలోనూ హీరోయిన్‌గా చేస్తారని, ఆల్రెడీ సంప్రదింపులు జరిగాయని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా. మరి... ‘రంగస్థలం’ తర్వాత రామ్‌చరణ్, సమంత మళ్లీ జోడీగా నటిస్తారా? లేదా అనే విషయంపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement