
తిరుమల లడ్డూ పేరుతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజకీయం చేస్తున్నాడని జనసేన మాజీ జనరల్ సెక్రటరీ రాజు రవితేజ అన్నారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలను తమ రాజకీయం కోసం ఆడుకోవడం ఏమాత్రం మంచిది కాదని పవన్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. ఎంతో సున్నితమైన అంశాన్ని తప్పుగా ప్రజల్లోకి తీసుకెళ్లారని కూటమి ప్రభుత్వాన్ని రవితేజ తప్పుబట్టారు. రాజ్యంగా పరమైన చట్టబద్ధతతో కూడిన పదవుల్లో ఉన్న పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి..? అంటూ ప్రశ్నించారు.
'ప్రస్తుతం ఏపీలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారా అనిస్తుంది. టీడీపీకి సపోర్ట్ చేసే మీడియా కూడా అదే రీతిలో ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఒకప్పుడు పవన్ కల్యాణ్‌ను తిట్టిన మీడియానే నేడు ఆయన్ను భుజానికి ఎత్తుకుంది. భవిష్యత్‌లో ఏదోరోజు పవన్ కల్యాణ్‌ను అదే మీడియా తొక్కేస్తుంది. ధర్మాన్ని పవన్ కల్యాణ్ పాటిస్తారా..? పవన్ కొత్త అవతారం వెనుకున్న ప్లాన్ ఏంటి..? క్రిస్టియన్స్‌ను పవన్ కల్యాణ్ ద్వేస్తున్నారా..? వంటి అంశాలపై రాజు రవితేజ స్పందించారు. ఈ పూర్తి వీడియోలో చూడొచ్చు.
