రాజ్‌కుమార్‌ రావు యాక్షన్‌ థ్రిల్లర్‌.. మోస్ట్‌ వయొలెంట్‌గా టీజర్! | Rajkummar Rao his upcoming crime action thriller Maalik teaser release | Sakshi
Sakshi News home page

Rajkummar Rao: రాజ్‌కుమార్‌ రావు యాక్షన్‌ థ్రిల్లర్‌.. మోస్ట్‌ వయొలెంట్‌గా టీజర్!

Jun 3 2025 7:38 PM | Updated on Jun 3 2025 7:43 PM

Rajkummar Rao his upcoming crime action thriller Maalik teaser release

బాలీవుడ్‌ హీరో రాజ్‌కుమార్ రావు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. గతేడాది స్త్రీ-2తో సూపర్ హిట్ కొట్టిన నటుడు.. ఇటీవల  భూల్ చుక్ మాఫ్ అనే మూవీతో ప్రేక్షకులను పలరించారు. తాజాగా మరో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌తో రెడీ అయిపోయారు. ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం మాలిక్. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

టీజర్‌ చూస్తే మోస్ట్‌ వయోలెంట్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో రాజ్‌ కుమార్‌ రావు నటిస్తున్నట్లు తెలుస్తోంది. టీజర్‌లో యాక్షన్ సీన్స్‌ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 1988లో ‍అలహాబాద్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రాజ్‌కుమార్‌ రావు గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. కాగా.. ఈ చిత్రానికి పుల్కిత్ దర్శకత్వం వహించారు. టిప్స్ ఫిల్మ్స్, నార్తర్న్ లైట్స్ ఫిల్మ్స్‌ బ్యానర్లపై కుమార్ తౌరానీ, జే షెవాక్రమణి నిర్మించారు. ఈ సినిమా జూలై 11, 2025న థియేటర్లలో విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement