సోషల్ మీడియాలో నెగెటివిటీ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కొంతమంది నెటిజన్స్ ద్వేషపూరిత కామెంట్స్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ముఖ్యంగా సినీ సెలెబ్రిటీల విషయంలో నెగెటివ్ ప్రచారం, బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. సంబంధం లేని విషయాలల్లోకి వాళ్లను లాగుతూ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ విషయంలో ఇదే జరిగింది. తనను ట్రోల్ చేయడమే కాకుండా తన పిల్లలను చంపుతామంటూ బెదిరింపు కామెంట్స్ చేయడంతో ఆయన ‘ఎక్స్’కి గుడ్‌బై చెప్పాడు. తన ముబైల్ నుంచి ‘ఎక్స్’ యాప్‌ని తొలగిస్తున్నానని..ఇక నుంచి దీనికి చూడనంటూ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించాడు.
అసలేం జరిగింది?
ఇటీవల పూణెలో హత్యకు గురైన కేతన్ అగర్వాల్ కేసుచుట్టూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది. ఓ నెటిజన్ రాహుల్‌ను ట్యాగ్ చేస్తూ మహిళల సమస్యలపై సినిమా తీసినట్లే పురుషులపై జరుగుతున్న అన్యాయాలపై కూడా తీస్తారా? అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన రాహుల్ సమాజంలో ఇప్పటికీ పితృస్వామ్య భావజాలం బలంగానే ఉందని అభిప్రాయపడ్డాడు.ఆ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. కొందరు అతన్ని దూషించడమే కాకుండా, ఆయన సతీమణి చిన్మయిపై కూడా వ్యక్తిగత దాడులకు దిగడం ప్రారంభించారు.
ఆ కామెంట్స్ తీవ్ర ఆవేదన కలిగించాయి
ఈ వాదనలు కేవలం సినిమా చర్చలకే పరిమితం కాలేదు. ఆయన పిల్లను చంపేస్తామని బెదిరింపులు స్థాయికి వెళ్లాయి. ఓ వ్యక్తి తన పిల్లలను చంపేస్తానని బెదిరిస్తూ చేసిన కామెంట్స్‌ని రాహుల్ ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ.. ఇలాంటి నెగెటివిటీని తన మనసులోకి తీసుకోలేకనే ఎక్స్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.
బ్రెజిల్, జపాన్ ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తున్న సమయంలో ఫుట్‌బాల్ ఆటకు సంబంధించిన ట్విటర్ అకౌంట్ కోసం ఈ యాప్(ఎక్స్) ఓపెన్ చేశా. పొరపాటున నోటిఫికేషన్లు చూశా. అవి చదివిన తర్వాత నా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్కడ కనిపించిన వ్యాఖ్యలు నాలో తీవ్ర కోపం, ఆవేదన కలిగించాయి. ఆ కామెంట్ చేసిన వాడిని ఎలాగైనా వెతికి పట్టుకొని ఏదైనా చేయాలనే నా మైండ్‌లోకి వచ్చింది. కోపం వచ్చినప్పుడు మామూలుగా నేను నన్ను నేను శాంతించుకోమని చెప్పుకుంటాను. కానీ ఈసారి అలా చేయాలనిపించలేదు. నా తల చాలా వేడిగా ఉంది. చాలా సేపటి వరకు అక్కడే కూర్చొని, టీవీలో ఆటను చూడకుండానే దాని వైపు చూస్తూ ఉండిపోయాను. చాలా నెమ్మదిగా నా హృదయ స్పందన రేటు కొంతవరకు సాధారణ స్థితికి వచ్చింది.
నా ఆలోచనలు నాకే నచ్చలేదు
బహుశా నేను అతిగా స్పందిస్తున్నానేమో. ఇది నా తప్పేమో.. నా పిల్లలు ఈ ద్వేషానికి అర్హులమేమో. కానీ నాకు ఈ యాప్‌తో పని అయిపోయింది. కొంతకాలంగా దీని నుంచి బయటపడాలని అనుకుంటున్నాను. నేను అలా చేయలేకపోవడానికి ఏకైక కారణం, క్రీడల వార్తలకు ఇది అత్యుత్తమ మూలం కావడమే. కానీ నాకు ఇక చాలు. ఆ ట్వీట్ చదివిన తర్వాత అరగంట పాటు నేను ప్రవర్తించిన తీరు నాకే నచ్చలేదు. నా ఆలోచనలు నాకే నచ్చలేదు. అంతేకాక, నా ఆత్మగౌరవం చాలా బలమైనది, దేనినీ నాపై ఆధిపత్యం చెలాయించనివ్వను. నా ఫోన్ నుంచి ఈ యాప్‌ను తొలగిస్తున్నాను’అని రాహుల్ రవీంద్రన్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.
I was sitting and watching the Brazil v Japan game. I wanted to check a football related Twitter account about something and I opened this app. Unfortunately, I made the mistake of checking my notifications too. And I came across this tweet. I wish I hadn’t.
I kept staring at… pic.twitter.com/abRnWC58Y2— Rahul Ravindran (@23_rahulr) June 29, 2026


