రాఘవ లారెన్స్ బాటలో మరో స్టార్ హీరో.. వీడియో వైరల్! | Raghava Lawrence Shares Hero SJ Suryah Help For Tractor To Poor Farmers, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Raghava Lawrence: రాఘవ లారెన్స్ బాటలో మరో హీరో.. వీడియో వైరల్!

Published Tue, Jun 18 2024 9:20 PM | Last Updated on Wed, Jun 19 2024 10:46 AM

Raghava Lawrence Shares Another Hero Help For Tractor To Poor Farmers

కోలీవుడ్ స్టార్‌ రాఘవ లారెన్స్ ‍సినిమాలతో పాటు సమాజ సేవలోనూ ముందున్నారు. మాత్రమ్ ఫౌండేషన్ ద్వారా రైతులు, రైతు కూలీలను ఆదుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది దివ్యాంగులకు త్రీవీలర్ వాహనాలు అందజేసిన ఆయన.. ఇటీవల పది మంది పేద రైతు కుటుంబాలకు ఇచ్చిన మాట ప్రకారం ట్రాక్టర్స్‌ అందించారు.

రాఘవ లారెన్స్‌ సేవలు చూసిన మరో హీరో సాయం చేసేందుకు ముందుకొచ్చారు. జిగర్తాండ డబుల్ ఎక్స్‌ చిత్రంలో కలిసి నటించిన ఎస్‌జే సూర్య తన వంతు సాయం చేశారు. తన సొంత డబ్బులతో ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి కాంచీపురం జిల్లాకు చెందిన బద్రీకి 11వ ట్రాక్టర్‌ను అందజేశారు. ఈ విషయాన్ని రాఘవ లారెన్స్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌జే సూర్యకు ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement