ఇచ్చిన మాట నిలబెట్టుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్! | Raghava Lawrence Distributed Tractor For Poor Farmers Family | Sakshi
Sakshi News home page

Raghava Lawrence: వారికళ్లలో ఆనందం కోసం.. ఏకంగా సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు!

Published Thu, May 2 2024 8:13 AM | Last Updated on Thu, May 2 2024 9:02 AM

Raghava Lawrence Distributed Tractor For Poor Farmers Family

కోలీవుడ్ దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌, రుద్రన్‌ చిత్రాలతో అలరించారు. సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉన్నప్పటికీ తనవంతు సాయంగా మాత్రం ట్రస్ట్‌ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇటీవల దివ్యాంగులకు ద్విచక్రవాహనాలు కూడా పంపిణీ చేశారు. పేదల కోసం ఇచ్చిన మాట ప్రకారం సాయం చేస్తూ ముందుకెళ్తున్నారు మన కోలీవుడ్ స్టార్.

తాజాగా మరో పది పేద రైతు కుటుంబాలకు అండగా నిలిచారు లారెన్స్. వారి కళ్లలో ఆనందం వెల్లివిరిసేలా చేశారు. కష్టాల్లో ఉన్న రైతులకు ఉచితంగా పది ట్రాక్టర్లు అందించారు. దీనికి సంబంధించిన వీడియోను రాఘవ తన ట్విటర్‌లో పంచుకున్నారు.

రాఘవ తన ట్విటర్‌లో రాస్తూ..' స్నేహితులు  అభిమానులు! మాత్రమ్ సేవ ఈరోజు ప్రారంభమైందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నా. గతంలో ప్రెస్‌మీట్‌లో చెప్పినట్లుగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులకు 10 ట్రాక్టర్లను అందజేస్తామని చెప్పాం. మా మొదటి ట్రాక్టర్ విలుపురం జిల్లాకు చెందిన రాజకన్నన్ కుటుంబానికి అందించాం. అతను తన సోదరి భర్త చనిపోవడంతో ఆమెతో పాటు తన కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. ఈ రోజు అతను కొత్త ట్రాక్టర్‌ని నడుపుతున్నప్పుడు అతని ముఖంలో ఆనందం, ఆశను చూడాలనేది నా కోరిక. అందుకే అతన్ని పిలిపించి సర్‌ప్రైజ్ ఇచ్చాం. కష్టాల్లో ఉన్న రైతులకు ఆనందాన్ని, మద్దతును అందజేద్దాం!' అంటూ పోస్ట్ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement