నిద్రలోనూ అవే కలలు వస్తున్నాయి.. అయినా తప్పకుండా చేస్తా: రాఘవ లారెన్స్ | Hero Raghava Lawrence Responds On Chandramukhi 2 Movie Flop, Deets Inside - Sakshi
Sakshi News home page

Raghava Lawrence: ఆ సినిమాతో మనశ్శాంతి లేదు.. అయినా చేస్తా: రాఘవ లారెన్స్

Published Wed, Oct 11 2023 7:09 AM

Raghava Lawrence Responds On Chandramukhi Flop 2  - Sakshi

ఇటీవలే చంద్రముఖి-2 సినిమాతో ప్రేక్షకులను అలరించిన కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్. ప్రస్తుతం ఎస్‌జే సూర్యతో కలిసి జగిర్తాండ డబుల్ ఎక్స్ చిత్రంలో నటిస్తున్నారు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరక్కించారు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం దీపావళి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్​ మీట్‌లో రాఘవ లారెన్స్‌ మాట్లాడారు. చంద్రముఖి- 2 ఫ్లాప్ గురించి ఆయన స్పందించారు. 

(ఇది చదవండి: మరో సక్సెస్‌ఫుల్‌ హీరో వచ్చాడు – హీరో నాని )

రాఘవ మాట్లాడుతూ..'చంద్రముఖి -2 సినిమాకు నా డబ్బులు నాకు వచ్చేశాయి. జీవితంలో అన్నీ మనమే గెలవాలని లేదు కదా. గ్రూప్‌ డ్యాన్సర్‌ నుంచి డ్యాన్సర్‌ మాస్టర్‌ అయితే చాలని భావించా. అక్కడి నుంచే దర్శకుడిని, హీరోను అయ్యాను. నా గ్లామర్‌కు హీరో అవకాశాలు ఇవ్వడమే దేవుడిచ్చిన పెద్ద వరం. మళ్లీ అందులో ఫ్లాప్‌, హిట్‌ గురించి అస్సలు ఆలోచించకూడదు. 'జిగిర్తాండ డబుల్‌ ఎక్స్‌' డబ్బింగ్‌ పూర్తయ్యాక చూశా. ఇందులో మంచి స్టోరీ ఉంది. సినిమా హిట్‌ అవుతుందన్న నమ్మకం ఉంది. ఎంత పెద్ద హీరో సినిమా చేసినా, డ్యాన్స్‌ చేసినా కథ లేకపోతే సినిమా ఆడదు. కంటెంట్‌ బలంగా ఉండాలంటే దర్శకుడు కూడా అంతే బలంగా ఉండాలి. కార్తీక్‌ సుబ్బరాజు విషయంలో నాకు ఎలాంటి డౌట్స్​ లేవు.' అని అన్నారు. 

(ఇది చదవండి: అమర్‌దీప్‌కి ఎలిమినేషన్ భయం.. ఇలా అయిపోయాడేంటి?)

అయితే కాంచన-4  ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు సార్.. అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ.. అన్ని దెయ్యాల సినిమాలు తీసి మనశ్శాంతిగా ఉండటం లేదు. రాత్రి కూడా కలలో అవే గుర్తుకొస్తున్నాయి. దీంతో నా మైండ్ కాస్తా‌ పిచ్చి పిచ్చిగా అయిపోయింది. కానీ ఏదో ఒక రోజు ఆ సినిమాను తప్పకుండా చేస్తా' అని అన్నారు. 

Advertisement
 
Advertisement