మరో సక్సెస్‌ఫుల్‌ హీరో వచ్చాడు – హీరో నాని 

Bubblegum movie teaser launch : chief guest Nani - Sakshi

‘‘బబుల్‌గమ్‌’ టీజర్‌ చూస్తే చాలా బలమైన కథ అనిపించింది. రోషన్‌ని స్క్రీన్‌పై చూస్తున్నప్పుడు చాలా పర్ఫెక్ట్‌గా కనిపించాడు. మరో సక్సెస్‌ఫుల్‌ హీరో తెలుగు ఇండస్ట్రీకి వచ్చాడని నమ్మకంగా చెప్పగలను. టీజర్‌ చూసినప్పుడు నాకు ఆ నమ్మకం వచ్చింది’’ అని హీరో నాని అన్నారు. నటుడు రాజీవ్‌ కనకాల, యాంకర్‌ సుమల తనయుడు రోషన్‌ కనకాల హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘బబుల్‌గమ్‌’.

రవికాంత్‌ పేరెపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మానసా చౌదరి కథానాయిక. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 29న విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్‌ విడుదల వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ– ‘‘రవికాంత్‌కి ఒక యునిక్‌ స్టయిల్‌ ఉంది. అది టీజర్‌లో కనిపిస్తోంది. తెలుగులో క్వాలిటీ ఫిలిమ్స్‌కి మారుపేరుగా మారిన పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్, వివేక్‌ కూచిభొట్లగారికి ‘బబుల్‌గమ్‌’ మరో హిట్‌గా నిలుస్తుంది’’ అన్నారు.

‘‘నాకు ఇష్టమైన పని (సినిమాలు) చేయడానికి ప్రోత్సహించిన అమ్మానాన్నలకి థ్యాంక్స్‌’’ అన్నారు రోషన్‌ కనకాల. ‘‘పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్‌తో పని చేయడం చాలా ఆనందాన్నిచ్చింది’’ అన్నారు రవికాంత్‌ పేరెపు. ‘‘బబుల్‌గమ్‌’ పెద్ద బ్లాక్‌ బస్టర్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్, సహనిర్మాత వివేక్‌ కూచిభొట్ల. హీరోయిన్‌ మానస, నటుడు రాజీవ్‌ కనకాల మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ చరణ్‌ పాకాల, కెమెరా: సురేష్‌ రగుతు, క్రియేటివ్‌ప్రోడ్యూసర్‌: దివ్య విజయ్, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్‌: మధులిక సంచన లంక. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top