Raghav Juyal Clarifies His Relationship With Shehnaaz Gill - Sakshi
Sakshi News home page

Shehnaaz Gill: నాకంత టైం లేదు.. డేటింగ్‌పై స్పందించిన నటుడు!

Jul 23 2023 2:04 PM | Updated on Jul 23 2023 2:42 PM

Raghav Juyal clarifies his relationship with Shehnaaz Gill - Sakshi

బిగ్‌ బాస్‌ ఫేమ్, బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్ బీ టౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే సల్మాన్ ఖాన్ చిత్రం కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్‌ చిత్రంలో నటించింది. బాలీవుడ్‌లో సీరియల్స్‌తో పాటు పలు చిత్రాల్లో నటించింది.  అయితే షెహనాజ్ గిల్ బిగ్ బాస్- 13లో తన సహ-కంటెస్టెంట్, బాలికా వధు నటుడు సిద్ధార్థ్ శుక్లాతో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించింది. అయితే ఊహించని విధంగా సిద్ధార్థ్ శుక్లా కథ విషాదాంతంగా మారింది. అనుకోని విధంగా సిద్ధార్థ మరణించాడు. 

ఆ తర్వాత షెహనాజ్‌ గిల్ మరొకరితో డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స వినిపించాయి. మరో నటుడు రాఘవ్ జుయల్‌తో డేటింగ్‌లో ఉందని బీటౌన్‌లో గుసగుసలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నటుడు రాఘవ్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా షెహనాజ్‌తో రిలేషన్‌పై నోరు విప్పారు. 

రాఘవ్ మాట్లాడుతూ..'రాబోయే కొద్ది నెలల్లో మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆ పనులతోనే నేను బిజీగా ఉన్నా. ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నా. ఎవరితోను రిలేషన్లో లేను. నాకు ఒకరిని ప్రేమించేందుకు, రిలేషన్‌లో కొనసాగించేంత టైం కూడా లేదు.' అని అన్నారు. కాగా.. సిద్ధార్థ్ మరణం తర్వాత షెహనాజ్ రెండు నెలల పాటు సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ సల్మాన్ 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'తో రీ ఎంట్రీ ఇచ్చింది.  

కాగా.. షెహనాజ్, రాఘవ్ జుయల్ ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం తర్వాత వీరిద్దరూ పలుసార్లు జంటగా కనిపించారు. దీంతో వీరిపై డేటింగ్ రూమర్స్ పెద్దఎత్తున ఊపందుకున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement