Pushpa Movie: These Celebrities Rejected This Movie, 'పుష్ప‌'ను వ‌దులుకున్న ఐదుగురు స్టార్స్ ఎవ‌రో తెలుసా? - Sakshi
Sakshi News home page

Pushpa: పుష్ప‌లో మొద‌ట‌గా అనుకున్న‌ది వీళ్ల‌నే!

Jan 28 2022 7:46 AM | Updated on Jan 28 2022 9:01 AM

Pushpa Movie: These Celebrities Rejected This Movie - Sakshi

శ్రీవ‌ల్లి పాత్ర‌కు తొలుత ర‌ష్మిక‌ను అనుకోలేద‌ని, ఈ క్యారెక్ట‌ర్‌కు స‌మంత అయితే క‌రెక్ట్‌గా సూట్ అవుతుంద‌ని భావించిన‌ట్లు వినికిడి. ఫ‌హ‌ద్ ఫాజిల్ పోషించిన పోలీసాఫీస‌ర్ పాత్ర మొద‌ట విజ‌య్ సేతుప‌తి ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌గా డేట్స్ కార‌ణంగా దాన్ని తిర‌స్క‌రించిన‌ట్లు తెలుస్తోంది

'పుష్ప‌.. పుష్ప‌రాజ్‌.. నీ య‌వ్వ త‌గ్గేదే లే..' డైలాగ్ దేశ‌మంతటా మార్మోగిపోతోంది. పుష్ప చిత్ర‌యూనిట్‌, న‌టీన‌టులు కూడా దీనికి ఈ రేంజ్‌లో ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని ఊహించి ఉండ‌రు. క‌రోనా కాలంలోనూ క‌లెక్ష‌న్లు కొల్ల‌గొడుతూ బాక్సాఫీస్‌పై దండ‌యాత్ర చేసింది పుష్ప‌. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆస‌క్తికర వార్త నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. పుష్ప సినిమా కోసం ముందుగా ఎవ‌రెవ‌ర్ని సంప్ర‌దించారు? ఎవ‌రు తిర‌స్క‌రించారు? అంటూ ఓ లిస్ట్ వైర‌ల్ అవుతోంది. దీని ప్ర‌కారం.. ద‌ర్శ‌కుడు సుకుమార్ పుష్ప స్క్రిప్ట్‌ను బ‌న్నీ కంటే ముందు మ‌హేశ్‌బాబుకు వివ‌రించాడ‌ట‌.

అయితే మ‌హేశ్ మేకోవ‌ర్‌కు సిద్ధంగా లేడ‌ని, స్క్రీన్‌పై నెగెటివ్ క్యారెక్ట‌ర్‌ను చూపించ‌డానికి ఇష్ట‌ప‌డ‌క నిస్సంకోచంగా కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పిన‌ట్లు తెలుస్తోంది. 'ఊ అంటావా' సాంగ్‌కు బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌టానీని తీసుకోవాల‌నుకున్నార‌ట‌. ఇందుకోసం ఆమెకు ఎంత రెమ్యున‌రేష‌న్ అయినా ఇవ్వ‌డానికి సిద్ధప‌డిన‌ప్ప‌టికీ ప‌లు కార‌ణాల‌తో ఆమె ఈ ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించిన‌ట్లు టాక్‌. ఆ త‌ర్వాత నోరా ఫ‌తేహీని సంప్ర‌దించ‌గా ఆమె భారీ మొత్తాన్ని డిమాండ్ చేయ‌డంతో ప‌క్క‌న పెట్టేశార‌ట‌.

శ్రీవ‌ల్లి పాత్ర‌కు తొలుత ర‌ష్మిక‌ను అనుకోలేద‌ని, ఈ క్యారెక్ట‌ర్‌కు స‌మంత అయితే క‌రెక్ట్‌గా సూట్ అవుతుంద‌ని భావించిన‌ట్లు వినికిడి. కానీ ఆమె ఈ ఆఫ‌ర్‌కు నో చెప్ప‌డంతో అలా ఈ పాత్ర ర‌ష్మిక‌ను వ‌రించింది. స‌మంత‌ను 'ఊ అంటావా' సాంగ్ చేయ‌డానికి ఒప్పించ‌డం కోసం ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డ విష‌యం తెలిసిందే! అలాగే ఫ‌హ‌ద్ ఫాజిల్ పోషించిన పోలీసాఫీస‌ర్ పాత్ర మొద‌ట విజ‌య్ సేతుప‌తి ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌గా డేట్స్ కార‌ణంగా దాన్ని తిర‌స్క‌రించిన‌ట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement