బన్నీతో బాక్సాఫీస్‌ వార్‌కి సై అంటున్న బాలీవుడ్‌ హీరో | Pushpa 2 Vs Vedaa: Boxoffice War Between John Abraham And Allu Arjun Pushpa, Vedaa Movies | Sakshi
Sakshi News home page

Pushpa 2 Vs Vedaa: బన్నీతో బాక్సాఫీస్‌ వార్‌కి సై అంటున్న బాలీవుడ్‌ హీరో

Jun 9 2024 4:01 PM | Updated on Jun 9 2024 5:13 PM

Pushpa 2 vs Vedaa: Boxoffice War Between John Abraham And Allu Arjun

‘పుష్ప..పుష్పరాజ్‌..నీయవ్వ తగ్గేదే లే’అంటూ వచ్చి బాక్సాఫీస్‌ని షేక్‌ చేశారు అల్లు అర్జున్‌. ఇప్పుడా ‘పుష్ప’ సినిమాకి సీక్వెల్‌గా ‘పుష్ప 2’ రాబోతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్ట్‌ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సారి పుష్పరాజ్‌తో పోటీ పడేందుకు బడా హీరోలెవరు సాహసించలేదు. ‘పుష్ప’కు వచ్చిన టాక్‌తో సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. 

అందుకు తగ్గట్లే ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాలు ఉన్నాయి. దీంతో అప్పటికే రిలీజ్ డేట్‌‌ అనౌన్స్‌ చేసిన సినిమాలు కూడా వెనక్కి తగ్గి.. పుష్పరాజ్‌ హవా తగ్గిపోయిన తర్వాత థియేటర్స్‌లోకి రాబోతున్నాయి. బాలీవుడ్‌లో ఆగస్ట్‌ 15న రోహిత్‌ శెట్టి తెరకెక్కిస్తున్న సింగం అగైన్‌ విడుదల కావాల్సింది.  పుష్ప 2 కంటే ముందే రోహిత్‌ శెట్టి రిలీజ్‌ డేట్‌ ప్రకటించాడు. 

ఎప్పుడైతే పుష్ప 2 అనౌన్స్‌మెంట్‌ వచ్చిందో రోహిత్‌ వెనక్కి తగ్గాడు.  కోలీవుడ్‌, మాలీవుడ్‌లోనూ పుష్పరాజ్‌తో పోటీ పడేందుకు ఎవరూ సాహసించలేదు.  ఇక పుష్పరాజ్‌కి పోటీ లేదు అనుకుంటున్న తరుణంలో.. బాక్సాఫీస్‌ వార్‌కి నేను సై అంటూ ముందుకు వచ్చాడు జాన్‌ అబ్రహం. ఆయన హీరోగా నటించిన వేదా సినిమా ఆగస్ట్‌ 15న రిలీజ్‌ కాబోతుంది. ఈ మేరకు నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు.  దీంతో బాలీవుడ్‌ మీడియాలో  పుష్ప వర్సెస్ వేదా అంటూ కథనాలు వస్తున్నాయి. 

అయితే బాలీవుడ్‌లోనే పుష్ప2  సినిమాకు ఎక్కువ బజ్‌ ఉంది.  అక్కడే ఎక్కువ మార్కెట్‌ జరుగుతోంది. అయినా కూడా బన్నీతో జాన్‌ అబ్రహం పోటీ పడుతున్నాడు. అయితే బన్నీ ఫ్యాన్స్‌ మాత్రం తమ హీరోతో పోటీ పడే స్థాయి జాన్‌ అబ్రహంకి లేదని అంటున్నారు. ‘పుష్పరాజ్‌’తో పోటీ అంత వీజీ కాదంటున్నారు. మరి ఈ బాక్సాఫీస్‌ వార్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement