'పుష్ప 2' రిలీజ్ డేట్ ఫిక్స్.. పెద్ద ప్లానింగే | Pushpa 2 Movie Release Date Announced Allu Arjun | Sakshi
Sakshi News home page

Pushpa 2 Release Date: 'పుష్ప 2' రిలీజ్.. కమల్ మూవీతో పోటీ!

Sep 11 2023 4:27 PM | Updated on Sep 11 2023 4:36 PM

Pushpa 2 Movie Release Date Announced Allu Arjun - Sakshi

'పుష్ప' సినిమాతో జాతీయ అవార్డు అందుకుని.. తన రేంజుని ఎక్కడికో తీసుకెళ్లిపోయిన అల్లు అర్జున్.. ఈ మూవీ సీక్వెల్ ప్రస్తుతం చేస్తున్నాడు. అవార్డు వచ్చిన ఆనందంలో మరింత ఎనర్జీతో పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్రం రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు. అలానే ఓ సరికొత్త పోస్టర్‌ని పోస్ట్ చేశారు.

2021 డిసెంబరు 2న 'పుష్ప'.. థియేటర్లలో రిలీజైంది. తొలుత దీన్ని కేవలం తెలుగు వరకు మాత్రమే అనుకున్నారు. కానీ రాజమౌళి సలహాతో ఎలాంటి ప్రచారం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. తెలుగులో మిక్స్‪‌డ్ టాక్ వచ్చింది. నార్త్‌లో మాత్రం బ్లాక్‌బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు)

దీంతో 'పుష్ప 2' విషయంలో అల్లు అర్జున్-సుకుమార్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే వచ్చే ఏడాది ఆగస్టు 15న థియేటర్లలోకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఇదే తేదీ కన్ఫర్మ్ చేయడానికి పెద్ద కారణముంది. 

ఎలానూ ఆగస్టు 15 గురువారం సెలవు. దీని తర్వాత శుక్ర-శని-ఆదివారం వీకెండ్. సోమవారం రక్షా బంధన్(రాఖీ).. ఇలా ఐదు రోజుల లాంగ్ వీకెండ్ ఉంది. కాబట్టి ఈ సినిమాకు అద్భుతమైన వసూళ్లు దక్కే ఛాన్స్ ఉంది. అయితే ఆగస్టు 15నే.. కమల్-శంకర్ 'భారతీయుడు 2' కూడా రిలీజ్ అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం బన్నీ vs కమల్ పోటీలో ఉన్నట్లే!

(ఇదీ చదవండి: పంచ్‌ ప్రసాద్‌కు ఆపరేషన్‌ పూర్తి.. అండగా ఏపీ ప్రభుత్వం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement