
‘ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా మావ’ సాంగ్ టాలీవుడ్‌లో ఇప్పటికీ కూడా ప్రత్యేకమే.. సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప (2021) చిత్రంలో ఈ పాట పాన్ ఇండియా రేంజ్‌లో క్లిక్ అయిపోయింది. సమంత స్టెప్పులకు దేవిశ్రీ ప్రసాద్ తనదైన మ్యూజిక్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. పుష్ప2లో కిస్సిక్ సాంగ్ కంటే కూడా సమంత పాటనే సూపర్ హిట్ అనేవారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే, ఈ సాంగ్‌లో స్టెప్పులేసే ఫస్ట్ ఛాయిస్ సమంత కాదని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవి తాజాగా చెప్పారు.

మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘రాబిన్ హుడ్’.. తాజాగా జరిగిన ఈ మూవీ ప్రీ రీలీజ్ ఈవెంట్‌లో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ సమంత స్టెప్పులు వేసిన పుష్ప సాంగ్ గురించి ఇలా చెప్పుకొచ్చారు. '‘రాబిన్ హుడ్’ స్పెషల్ సాంగ్ కోసం కేతిక శర్మను సంప్రదించగానే ఆమె ఒప్పుకున్నారు. పుష్ప-1 సమయంలో సమంతతో చర్చలు జరపకముందే కేతిక శర్మను తీసుకోవాలని అనుకున్నాం. అప్పుడు ఆ ఛాన్స్ లేకుండా పోయింది.. మళ్లీ ఈ సినిమాలో (రాబిన్ హుడ్) కుదిరింది. మేము అడగంగానే కేతిక ఒప్పకున్నందుకు ధన్యవాదాలు చెబుతున్నాను.' అని రవి చెప్పుకొచ్చారు.
రాబిన్‌హుడ్‌లో 'అది దా సర్ప్రైజ్' అంటూ కేతిక శర్మ వేసిన స్టెప్పులకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. నెట్టింట ఈ సాంగ్ వైరల్ అవుతుంది. ఇప్పటికే లెక్కలేనన్ని రీల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఈ పాట ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.