‘రుద్రమాంబపురం’ థియేటర్‌ మూవీ  అంటున్నారు: నిర్మాత | Producer Nanduri Ram Talks About Rudramambapuram Movie | Sakshi
Sakshi News home page

‘రుద్రమాంబపురం’ థియేటర్‌ మూవీ  అంటున్నారు: నిర్మాత

Jul 9 2023 5:18 PM | Updated on Jul 9 2023 5:18 PM

Producer Nanduri Ram Talks About Rudramambapuram Movie - Sakshi

‘రుద్రమాంబపురం’ సినిమా చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. ఇది థియేటర్‌లో రావాల్సిన మూవీ అని చెప్పడం ఆనందంగా ఉంది’ అని నిర్మాత నండూరి రాము అన్నారు. ఎన్‌వీఎల్ ఆర్ట్స్ ప‌తాకంపై నండూరి రాము నిర్మించిన చిత్రం 'రుద్రమాంబపురం'. ఈ చిత్రానికి మ‌హేష్ బంటు ద‌ర్శ‌కత్వం వహించారు. జులై 6 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత నండూరి రాము మీడియాతో మాట్లాడుతూ.. ‘సినిమా చూసిన ప్రతి ఒక్కరు బాగుందని చెబుతున్నారు. నటులు అజయ్ ఘోష్, రాజశేఖర్ పోటీ పడి నటించారు.యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి మంచి విజయం అందించిన ఓటీటీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. త్వరలోనే ఎన్‌వీఎల్ ఆర్ట్స్ పతాకంపై మరో సినిమాను అనౌన్స్‌ చేస్తాం’ అన్నారు. ఈ చిత్రంలో శుభోద‌యం సుబ్బారావు, అజయ్ ఘోష్, అర్జున్ రాజేష్, పలాస జనార్దన్, నండూరి రాము, సాయి, శంకర్, డివి.సుబ్బారావు, ప్రమీల, రజిని శ్రీకళ, రత్నశ్రీ, షెహనాజ్, రజిని, సురేఖ, రమణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement