పెళ్లి తర్వాత లైఫ్‌లో థ్రిల్ కావాలా?.. అయితే ఈ టీజర్ చూసేయండి! | Priyadarshi and Anandhi Premante Movie Official Teaser out now | Sakshi
Sakshi News home page

Premante Teaser: పెళ్లి తర్వాత లైఫ్‌లో థ్రిల్ కావాలా?.. అయితే టీజర్ చూసేయండి!

Nov 2 2025 5:09 PM | Updated on Nov 2 2025 5:09 PM

Priyadarshi and Anandhi Premante Movie Official Teaser out now

టాలీవుడ్ హీరో ప్రియదర్శి పులికొండ(Priyadarshi Pulikonda) నటిస్తోన్న తాజా చిత్రం 'ప్రేమంటే'(Premante). ఈ మూవీతో నవనీత్‌ శ్రీరామ్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. థ్రిల్‌ ప్రాప్తిరస్తు అనేది సబ్ టైటిల్. ఈ సినిమాలో ఆనంది(Anandhi) హీరోయిన్‌గా కనిపించనుంది. లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రాన్ని జాన్వి నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు.

ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తే పెళ్లి అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత నా లైఫ్ థ్రిల్లింగ్‌గా ఉండాలి అంతే అని హీరోయిన్‌ చెప్పే డైలాగ్‌తో కథేంటో అర్థమవుతోంది. ఫుల్ లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమా నవంబర్ 21న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ ‍మూవీకి  లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చారు.

 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement