రాజమౌళి సినిమా.. అదిరిపోయేలా 'పృథ్వీరాజ్‌' ఫస్ట్‌లుక్‌ | Prithviraj Sukumaran first look out from SSMB29 | Sakshi
Sakshi News home page

రాజమౌళి సినిమా.. అదిరిపోయేలా 'పృథ్వీరాజ్‌' ఫస్ట్‌లుక్‌

Nov 7 2025 12:22 PM | Updated on Nov 7 2025 1:05 PM

Prithviraj Sukumaran first look out from SSMB29

 మహేశ్‌బాబు (Mahesh Babu),  ఎస్‌.ఎస్‌.రాజమౌళి (SS Rajamouli)ల సినిమా  #SSMB29 నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఫస్ట్‌ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. అదిరిపోయే రేంజ్‌లో ఉన్న  ఈ పోస్టర్‌ను చూస్తుంటే ఆయన మరోసారి ఈ మూవీలో సరికొత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

కుంభ పాత్ర గురించి రాజమౌళి కామెంట్‌
#SSMB29 సినిమాలో కుంభ పాత్రలో పృథ్వీరాజ్‌(Prithviraj Sukumaran) కనిపించన్నున్నారని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఒక వీల్‌చైర్‌లో కూర్చోని రోబో సాయంతో ఒక భారీ ఫైట్‌ సీన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్‌ను ప్రేరణగా తీసుకుని ఈ పాత్రను డిజైన్‌ చేశారా అనిపించేలా ఉంది.  పృథ్వీరాజ్‌ పాత్ర గురించి రాజమౌళి  ఇలా చెప్పారు. 'పృథ్వీతో మొదటి షాట్ చిత్రీకరించిన తర్వాత, నేను అతని దగ్గరకు వెళ్లి, మీరు నాకు తెలిసిన అత్యుత్తమ నటులలో ఒకరు అని చెప్పాను. ఈ దుష్ట, క్రూరమైన, శక్తివంతమైన విరోధి కుంభకు ప్రాణం పోయడం సృజనాత్మకంగా చాలా సంతృప్తికరంగా ఉంది.  పృథ్వీకి ధన్యవాదాలు.' అంటూ ఆయన ఒక పోస్ట్‌ చేశారు.
 

#GlobeTrotter హ్యాష్‌ట్యాగ్‌తో  ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా  రాజమౌళి తీసుకెళ్తున్నారు.  నవంబర్‌ 15న ఒక భారీ ఈవెంట్‌తో  #SSMB29  సినిమా టైటిల్‌తో పాటు మహేష్‌ బాబు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే సుమారు 2 నిమిషాలకు పైగా ఉండే ఒక వీడియోను కూడా అభిమానులతో పంచుకోనున్నారు. ఈ  కార్యక్రమాన్ని లైవ్‌లో జియోహాట్‌ స్టార్‌ (JioHotstar)లో చూడొచ్చు. ఈ వేడుక కోసం ఇప్పటికే  ప్రియాంకచోప్రా హైదరాబాద్‌ చేరుకున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement