
దేశ రాజధాని ఢిల్లీ జాతీయ చలనచిత్ర అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందజేశారు. 2023 ఏడాది గానూ ఈ అవార్డులను అందించారు. ఉత్తమ నటులుగా షారూఖ్ ఖన్, విక్రాంత్ మాస్సే.. జాతీయ ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ అవార్డులు అందుకున్నారు. జాతీయ ఉత్తమ చిత్రంగా 12 th ఫెయిల్ చిత్రానికి ఘనత దక్కింది. ఇవాళ ఢిల్లీలో 71 వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం గ్రాండ్గా నిర్వహించారు.
తెలుగులో జాతీయ అవార్డు గ్రహీతలు వీళ్లే..
తెలుగులో ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరికి జాతీయ అవార్డ్ దక్కింది. బెస్ట్ యాక్షన్ డైరెక్షన్,స్టంట్ కొరియోగ్రఫీ అవార్డ్ హనుమాన్ సొంతం చేసుకుంది. బలగం చిత్రంలోని ఊరు పల్లెటూరు పాట అనే పాటకు బెస్ట్ లిరిక్స్ విభాగంలో అవార్డ్ సొంతమైంది. బెస్ట్ స్క్రీన్ ప్లే బేబీ సినిమా( సాయి రాజేష్ నీలం), బెస్ట్ మెయిల్ ప్లే బ్యాక్ సింగర్ రోహిత్ను జాతీయ అవార్డులు వరించాయి. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి (గాంధీ తాత చెట్టు) జాతీయ అవార్డ్ అందుకుంది. ఉత్తమ్ చిత్రం యానిమేషన్ విజువల్స్,గేమింగ్ అండ్ కామిక్ విభాగంలో హనుమాన్ నేషనల్ అవార్డ్ను సాధించింది.
#WATCH | Delhi: Superstar Shah Rukh Khan, actors Rani Mukerji and Vikrant Massey present at Vigyan Bhawan for the 71st National Film Awards.
The Best Actor in a Leading Role award has been shared by Shah Rukh Khan for 'Jawan' and Vikrant Massey for '12th Fail', and the Best… pic.twitter.com/PfogNDvfyx— ANI (@ANI) September 23, 2025