క్రేజ్ కాపాడుకోలేక‌పోయాడు.. ఆ త‌ప్పు వ‌ల్ల కెరీర్‌, జీవితం స‌ర్వ‌నాశ‌నం! | Sakshi
Sakshi News home page

కెరీర్ ప‌త‌నం.. సంసారం అల్ల‌క‌ల్లోలం.. చిన్న వ‌య‌సులోనే లైఫ్‌కు ఎండ్‌కార్డ్‌

Published Sun, Feb 25 2024 4:31 PM

Premikula Roju Hero Kunal Singh Life Story In Telugu - Sakshi

ఒక్క ఛాన్స్‌.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ తిరిగేవాళ్లు చాలామందే కనిపిస్తారు. నిజంగానే ఒక్క ఛాన్స్‌తో అద్భుతాలు జ‌రిగిపోతాయా? అంటే అవున‌నే చెప్పాలి. ఎంతోమంది తొలి సినిమాతోనే తామేంటో ప్రూవ్ చేసుకుని గొప్ప స్థాయికి ఎదిగారు. అదే స‌మ‌యంలో ఫ‌స్ట్ సినిమాతో క్రేజ్ అందుకున్నా త‌ర్వాతి రోజుల్లో దాన్ని కాపాడుకోలేక మ‌రుగున‌ప‌డ్డ హీరోలూ ఉన్నారు. ప్రేమికుల రోజు సినిమా హీరో కునాల్ సింగ్ ఈ కోవ‌లోకే వ‌స్తాడు. ఆయ‌న గురించే నేటి ప్ర‌త్యేక క‌థ‌నం..

ఫ‌స్ట్ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్‌
కునాల్ సింగ్ న‌టించిన తొలి సినిమా కాద‌ల్ దినం. ఈ మూవీ తెలుగులో ప్రేమికుల రోజు పేరిట డ‌బ్ అయింది. ఇందులో సోనాలి బింద్రే హీరోయిన్‌గా యాక్ట్ చేయ‌గా ఏఆర్‌ రెహ‌మాన్ సంగీతం అందించాడు. వాలు క‌నుల‌దానా, ప్రేమ అనే ప‌రీక్ష రాసి.. , దాండియా ఆట‌లు ఆడ‌.. ఇలా అన్ని పాట‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌య్యాయి. సినిమా కూడా సూప‌ర్ హిట్ట‌యింది. ఇంకేముంది.. వ‌రుస అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. ఇక్క‌డే త‌ప్ప‌ట‌డుగులు వేశాడు. హిట్ల క‌న్నా ఫ్లాపులే ఎక్కువ‌గా అందుకున్నాడు. అత‌డు సంత‌కం చేసిన సినిమాలు ఆదిలోనే ఆగిపోయాయి.(చ‌ద‌వండి: Vithika Sheru: మీ స్థానాన్ని ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేరు.. వితికా ఎమోష‌న‌ల్ పోస్ట్‌)

భార్య ఉండ‌గా న‌టితో క్లోజ్‌..
మ‌రికొన్ని షూటింగ్ జ‌రిగినా విడుద‌ల‌కు నోచుకోలేదు. ఐదేళ్ల‌లోనే డీలా ప‌డిపోయాడు. 2007లో చివ‌ర‌గా నంబ‌నిన్ కాద‌లై అనే సినిమాలో యాక్ట్ చేశాడు. యాక్ట‌ర్‌గా రాణించ‌డం క‌ష్ట‌మ‌ని తెలియ‌గానే అసిస్టెంట్ డైరెక్ట‌ర్ అవ‌తార‌మెత్తాడు. త‌ర్వాత నిర్మాత‌గానూ మారాడు. అయ‌తే కునాల్, న‌టి లావిణ పంక‌జ్ భాటియా అత్యంత స‌న్నిహితంగా మెదిలేవార‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. అప్ప‌టికే అత‌డికి భార్య, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అత‌డి ప్రేమ‌ విష‌యం కునాల్ భార్య అనురాధ‌కు తెలిసింది. దీని గురించి భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రిగేవ‌ట‌!

ప్రాణాలు తీసుకున్నాడు
ఆమె కోపంతో ఇల్లు విడిచి పుట్టింటికి వెళ్లిపోవ‌డంతో కునాల్ మ‌న‌స్తాపానికి గుర‌య్యాడు. 2008 ఫిబ్ర‌వ‌రి 7న త‌న అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకుని చ‌నిపోయాడు. ఇది జ‌ర‌గ‌డానికి  కొన్ని గంట‌ల ముందు ఏదో సినిమా గురించి స్క్రిప్ట్ రైట‌ర్‌, కాస్ట్యూమ్ డిజైన‌ర్స్‌, న‌టి పంక‌జ్‌తో త‌న ఇంట్లోనే చ‌ర్చ‌లు జ‌రిపాడు. అంద‌రూ వెళ్లిపోయాక పంక‌జ్ అక్క‌డే ఉన్న‌ వాష్‌రూమ్‌ను వాడుకుందామ‌ని వెళ్లి వ‌చ్చింది. అంత‌లోనే కునాల్ ఫ్యాన్‌కు వేలాడుతూ క‌నిపించాడు.

ఏమీ మిగ‌ల్లేదు
అయితే పంక‌జ్‌కు, కునాల్‌కు మ‌ధ్య ఏదో గొడ‌వ జ‌రిగింద‌ని, ఆ ఆవేశంలోనే హీరో ఇంత‌టి అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడ‌న్న పుకార్లు కూడా వ‌చ్చాయి. ఈ కేసులో పోలీసులు పంక‌జ్ భాటియాను అదుపులోకి తీసుకుని విచారించారు. కానీ ఇది ఆత్మ‌హ‌త్యే అని నిర్ధారించారు. అంత‌కుముందు కూడా కునాల్ ఒక‌టీరెండు సార్లు చ‌నిపోయేందుకు ప్ర‌య‌త్నించాడ‌ట‌! ఒక‌వైపు కెరీర్ నాశ‌న‌మైంది.. మ‌రోవైపు సంసార జీవితం కూడా స‌వ్యంగా లేదు.. వీటికి తోడు నిర్మాత‌గా అప్పుల‌పాలు అవ‌డంతోనే అత‌డు త‌నువు చాలించాడ‌ని చెప్తుంటారు. ఏదేమైనా 31 ఏళ్ల వ‌య‌సులోనే అత‌డు ప్రాణాలు తీసుకోవ‌డం అంద‌రినీ క‌లిచివేసింది.

చ‌ద‌వండి: త‌న‌కెందుకు క్రెడిట్‌? అని ఆటిట్యూడ్ చూపించా.. త‌ర్వాతి సినిమాల్లో నాకు ఛాన్స్‌ ఇవ్వ‌లే!

Advertisement
 
Advertisement