రోజా సూప‌ర్ హిట్‌.. డైరెక్ట‌ర్‌కు ఎందుకు క్రెడిట్ ఇవ్వాలి?: హీరోయిన్‌ | Sakshi
Sakshi News home page

Madhoo: త‌న‌కెందుకు క్రెడిట్‌? అని ఆటిట్యూడ్ చూపించా.. త‌ర్వాతి సినిమాల్లో నాకు ఛాన్స్‌ ఇవ్వ‌లే!

Published Sun, Feb 25 2024 3:05 PM

Madhoo Regrets not Crediting Mani Ratnam for Roja Success, I became Arrogant Because - Sakshi

ప్ర‌తి న‌టీన‌టుడి జీవితంలో కొన్ని మ‌ర్చిపోలేని సినిమాలుంటాయి. వారి కెరీర్‌ను అంద‌ల‌మెక్కించిన చిత్రాల‌ను అంత ఈజీగా మ‌ర్చిపోలేరు. అలా సీనియ‌ర్ హీరోయిన్‌ మ‌ధుబాల జీవితంలో 'రోజా' మూవీ ఓ మైలురాయిగా నిలిచిపోయింది. 1992లో వ‌చ్చిన ఈ సినిమాను మ‌ణిర‌త్నం అద్భుతంగా తీర్చిదిద్దాడు. అందుకే అది అప్ప‌టికీ, ఇప్ప‌టికీ ప్ర‌త్యేక చిత్రంగా నిలిచిపోయింది.

ఆయ‌నంటే నాకు గౌర‌వం.. కానీ..
అయితే ఈ మూవీ త‌ర్వాత ద‌ర్శ‌కుడితో స్నేహ‌పూర్వ‌కంగా మ‌సులుకోలేద‌ట మ‌ధుబాల‌. త‌న యాటిట్యూడ్‌తో అంద‌రినీ దూరం పెట్టింద‌ట‌. రోజా క్రెడిట్‌ను కూడా అత‌డికి ఇవ్వ‌లేద‌ట‌. అందుకు ఇప్పుడు బాధ‌ప‌డుతోంది. తాజాగా ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. 'మ‌ణి స‌ర్ అంద‌రితోనూ బాగానే ఉండేవారు. అత‌డితో ట‌చ్‌లో ఉండేందుకు చాలాసార్లు ప్ర‌య‌త్నించాను.. మెసేజ్‌లు పంపాను. ఆయ‌నంటే నాకు ఎంతో అభిమానం, గౌర‌వం.

యాటిట్యూడ్ చూపించా..
కానీ రోజా మూవీ రిలీజైన స‌మ‌యంలో ఇలా లేను. ఆయ‌న నాకేం ఫేవ‌ర్ చేశాడ‌ని? త‌న‌కు రోజాలాంటి అమ్మాయి కావాలి.. నాలో రోజాను చూసుకున్నాడు కాబ‌ట్టి న‌న్ను త‌న సినిమాకు తీసుకున్నాడు. అంతేగా.. అందులో ప్ర‌త్యేక‌త ఏముంది? ఇలా ఆటిట్యూడ్ చూపించేదాన్ని. నేను ప‌డ్డ బాధ‌లో నుంచే ఈ అహంకారం, కోపం పుట్టుకొచ్చాయి. ఎందుకంటే నా కెరీర్‌లో ఎవ‌రూ న‌న్ను స‌పోర్ట్ చేయ‌లేదు. మేక‌ప్ ద‌గ్గ‌రి నుంచి కాస్ట్యూమ్స్ వ‌ర‌కు అన్నీ నేనే రెడీ చేసుకునేదాన్ని. ఒక్క‌దాన్నే అంతా చేసుకున్నాను. అందుకే ఎవ‌రికైనా గుర్తింపు ఇవ్వ‌డానికి మ‌న‌సొప్పేది కాదు.

స్నేహ‌పూర్వ‌కంగా మ‌సులుకోలేదు.. అందుకే!
కానీ మ‌ణిర‌త్నం స‌ర్‌కు ఆ గుర్తింపు, ప్ర‌శంస‌లు ద‌క్కాల్సిందే! అప్పుడు చెప్ప‌లేక‌పోయాను.. కానీ ఇప్పుడు చెప్తున్నాను. నాకు గుర్తింపును తీసుకువ‌చ్చిందే ఆయ‌న‌.. ఆయ‌న‌కు క్రెడిట్ ద‌క్కాల్సిందే! నేను త‌న‌తో స్నేహ‌పూర్వ‌కంగా మెదులుకోలేదు.. అనుబంధాన్ని కొన‌సాగించ‌లేదు.. అందుకే ఆయ‌న త‌ర్వాతి సినిమాల్లో న‌న్ను తీసుకోలేదు' అని చెప్పుకొచ్చింది. కాగా మ‌ధు చివ‌ర‌గా శాకుంత‌లం సినిమాలో న‌టించింది. అలాగే స్వీట్ కారం కాఫీ అనే తమిళ‌ వెబ్ సిరీస్‌లోనూ యాక్ట్ చేసింది.

చ‌ద‌వండి: న‌టుడితో రెండో పెళ్లి.. నెట్టింట ఫోటోలు వైర‌ల్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement