breaking news
premikula roju
-
క్రేజ్ కాపాడుకోలేకపోయాడు.. ఆ తప్పు వల్ల కెరీర్, జీవితం సర్వనాశనం!
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ తిరిగేవాళ్లు చాలామందే కనిపిస్తారు. నిజంగానే ఒక్క ఛాన్స్‌తో అద్భుతాలు జరిగిపోతాయా? అంటే అవుననే చెప్పాలి. ఎంతోమంది తొలి సినిమాతోనే తామేంటో ప్రూవ్ చేసుకుని గొప్ప స్థాయికి ఎదిగారు. అదే సమయంలో ఫస్ట్ సినిమాతో క్రేజ్ అందుకున్నా తర్వాతి రోజుల్లో దాన్ని కాపాడుకోలేక మరుగునపడ్డ హీరోలూ ఉన్నారు. ప్రేమికుల రోజు సినిమా హీరో కునాల్ సింగ్ ఈ కోవలోకే వస్తాడు. ఆయన గురించే నేటి ప్రత్యేక కథనం.. ఫస్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్ కునాల్ సింగ్ నటించిన తొలి సినిమా కాదల్ దినం. ఈ మూవీ తెలుగులో ప్రేమికుల రోజు పేరిట డబ్ అయింది. ఇందులో సోనాలి బింద్రే హీరోయిన్గా యాక్ట్ చేయగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. వాలు కనులదానా, ప్రేమ అనే పరీక్ష రాసి.. , దాండియా ఆటలు ఆడ.. ఇలా అన్ని పాటలు బ్లాక్‌బస్టర్ హిట్టయ్యాయి. సినిమా కూడా సూపర్ హిట్టయింది. ఇంకేముంది.. వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇక్కడే తప్పటడుగులు వేశాడు. హిట్ల కన్నా ఫ్లాపులే ఎక్కువగా అందుకున్నాడు. అతడు సంతకం చేసిన సినిమాలు ఆదిలోనే ఆగిపోయాయి. (చదవండి: Vithika Sheru: మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.. వితికా ఎమోషనల్ పోస్ట్) భార్య ఉండగా నటితో క్లోజ్.. మరికొన్ని షూటింగ్ జరిగినా విడుదలకు నోచుకోలేదు. ఐదేళ్లలోనే డీలా పడిపోయాడు. 2007లో చివరగా నంబనిన్ కాదలై అనే సినిమాలో యాక్ట్ చేశాడు. యాక్టర్‌గా రాణించడం కష్టమని తెలియగానే అసిస్టెంట్ డైరెక్టర్ అవతారమెత్తాడు. తర్వాత నిర్మాతగానూ మారాడు. అయతే కునాల్, నటి లావిణ పంకజ్ భాటియా అత్యంత సన్నిహితంగా మెదిలేవారని అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పటికే అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి ప్రేమ విషయం కునాల్ భార్య అనురాధకు తెలిసింది. దీని గురించి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవట! ప్రాణాలు తీసుకున్నాడు ఆమె కోపంతో ఇల్లు విడిచి పుట్టింటికి వెళ్లిపోవడంతో కునాల్ మనస్తాపానికి గురయ్యాడు. 2008 ఫిబ్రవరి 7న తన అపార్ట్మెంట్లో ఉరేసుకుని చనిపోయాడు. ఇది జరగడానికి కొన్ని గంటల ముందు ఏదో సినిమా గురించి స్క్రిప్ట్ రైటర్, కాస్ట్యూమ్ డిజైనర్స్, నటి పంకజ్‌తో తన ఇంట్లోనే చర్చలు జరిపాడు. అందరూ వెళ్లిపోయాక పంకజ్ అక్కడే ఉన్న వాష్‌రూమ్‌ను వాడుకుందామని వెళ్లి వచ్చింది. అంతలోనే కునాల్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఏమీ మిగల్లేదు అయితే పంకజ్‌కు, కునాల్‌కు మధ్య ఏదో గొడవ జరిగిందని, ఆ ఆవేశంలోనే హీరో ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడన్న పుకార్లు కూడా వచ్చాయి. ఈ కేసులో పోలీసులు పంకజ్ భాటియాను అదుపులోకి తీసుకుని విచారించారు. కానీ ఇది ఆత్మహత్యే అని నిర్ధారించారు. అంతకుముందు కూడా కునాల్ ఒకటీరెండు సార్లు చనిపోయేందుకు ప్రయత్నించాడట! ఒకవైపు కెరీర్ నాశనమైంది.. మరోవైపు సంసార జీవితం కూడా సవ్యంగా లేదు.. వీటికి తోడు నిర్మాతగా అప్పులపాలు అవడంతోనే అతడు తనువు చాలించాడని చెప్తుంటారు. ఏదేమైనా 31 ఏళ్ల వయసులోనే అతడు ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలిచివేసింది. చదవండి: తనకెందుకు క్రెడిట్? అని ఆటిట్యూడ్ చూపించా.. తర్వాతి సినిమాల్లో నాకు ఛాన్స్ ఇవ్వలే! -
ప్రేమికుల రోజు చూడాల్సిన స్పెషల్ మూవీస్ ఇవే..
వాలెంటైన్స్ డే.. ప్రేమికులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న రోజిది. ఎప్పటినుంచో ప్రేమలో మునిగి తేలుతున్నా ఎందుకో ప్రేమికులకు ఈరోజు మాత్రం కాస్త స్పెషల్ అని చెప్పొచ్చు. లవ్‌ను ఎక్స్‌ప్రెస్ చేయడానికి వాలెంటైన్స్ డేకి మించిన రోజు ఉండదని భావిస్తారు. అందుకే ప్రేమికుల రోజును మరింత స్పెషల్‌గా డిజైన్ చేసుకుంటారు. రెండు మనసుల్ని దగ్గర చేసే ప్రేమ మత్తు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి దేవదాసు దగ్గర్నుంచి లేటెస్ట్ సీతారామం వరకు ఎన్నో ప్రేమకథా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తనదైన మ్యాజిక్ చేశాయి. ప్రేమికుల రోజు సందర్భంగా ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీస్‌గా నిలిచిన సినిమాలేంటో చూసేద్దాం. ప్రేమికుల రోజు సోనాలి బింద్రే, కునాల్ జంటగా నటించిన ప్రేమికుల రోజు సినిమా వాలైంటైన్స్ డే స్పెషల్ మూవీస్‌లో టాప్ ప్లేస్‌లో ఉంటుందనడంలో సందేహం లేదు. కాథిర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఫేస్బుక్ ద్వారా ప్రేమలో పడటం, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోవడం, క్లైమాక్స్‌లో మళ్లీ కలవడం ఇలా ప్రతీ సీన్ ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. కథకు తోడు ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. జయం దేశ డైరెక్షన్లో వచ్చిన జయం సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్. నితిన్, సదా జంటగా నటించిన ఈ సినిమా హీరో,హీరోయిన్లకు స్టార్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్‌గా నిలిచాయి. తెలుగులో విజయం సాధించడంతో తమిళంలోనూ రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ సక్సెస్ అయ్యిందీ చిత్రం. గీతాంజలి నాగార్జున, గిరిజ జంటగా నటించిన ఎవర్గ్రీన్ సినిమా గీతాంజలి. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పటికీ ఇప్పటికీ సూపర్ హిట్టే. ఇళయరాజ సంగీతం సినిమాకు మరో ఆణిముత్యంలా నిలిచింది. ఇప్పటికీ ఇందులోని సాంగ్స్, సన్నివేశాలు ఎవర్గ్రీన్. ఏ మాయ చేసావే నాగార్జున, సమంత జంటగా నటించిన సినిమా ఏ మాయ చేసావే. గౌతమ్ మీనన్ డైరక్షన్లో వచ్చిన ఈ సినిమా క్లాసిక్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా సమంతకు ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సినిమాను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. ఈ మూవీ షూటింగ్ టైంలోనే సమంత, నాగ చైతన్య మధ్య స్నేహం కుదిరింది. పెళ్లికి దారితీసింది. కానీ ఏమైందో ఏమో మనస్పర్థల కారణంగా వాళ్లు విడాకులు తీసుకున్నారు. ఆర్య సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన అందమైన ప్రేమ కథ ఆర్య. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా బన్నీకి స్టార్డమ్కు తెచ్చిపెట్టింది. అప్పటికి వరకు వచ్చిన ప్రేమకథలకు బిన్నంగా తెరకెక్కిన ఆర్య సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ‘ఫీల్ మై లవ్’ అంటూ దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో ఆకట్టుకున్నారు. ఇప్పటికీ ఈ పాట ప్రపోజ్ డేకు బెస్ట్ సాంగ్ అని చెప్పొచ్చు. లవ్ ఎట్ సైట్, ట్రయాంగిల్ లవ్‌స్టోరీని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ సూపర్ సక్సెస్ అయ్యారు. లవ్‌స్టోరీ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్‌స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కేవలం లవ్ యాంగిల్లోనే కాకుండా కుల వివక్ష, చిన్నతనంలోనే లైంగిక వేధింపులు వంటి సెన్సిటివ్ అంశాలను టచ్ చేశారు. నిజానికి శేఖర్ కమ్ముల గత సినిమాల కంటే ఇది కాస్త భిన్నమైనదనే చెప్పాలి. కథలో ఇంటెన్స్ స్టోరీతో పాటు టైటిల్‌కు తగ్గట్లుగా మంచి ఫీల్‌గుడ్ పాటలతో సాగిన ఈ చిత్రం వాలైంటైన్స్ డే స్పెషల్ మూవీస్‌లో ఒకటి. వీటితో పాటు సఖి, దేవదాసు, ప్రేమనగర్, ప్రేమదేశం, వర్షం, సీతారామం సహా ఎన్నో ప్రేమకథలు వెండితెరపై మరుపురాని చిత్రాలుగా నిలిచాయి. -
Valentines Day Special: హ్యాపీ వాలెంటైన్స్ డే
-
లబ్ డబ్... లవ్ డబ్!!
లబ్ డబ్.. లబ్ డబ్.. గుండె చప్పుడు ఇది! మరి, ఆ గుండెకి ప్రేమ తోడైతే... లవ్ డబ్.. లవ్ డబ్... లవ్ డబ్... అంటుంది! తెలుగు అయినా.. హిందీ అయినా... తమిళ్ అయినా.. ప్రేమ.. ఇష్క్.. కాదల్... పిలుపు మారుతుందేమో కానీ గుండె చప్పుడు మారదు! లవ్ మీటర్ ఎక్కడైనా ఒక్కటే తెలుగు ప్రేక్షకుల హృదయాలను మీటిన డబ్బింగ్ లవ్వులు ఎన్నో... లబ్ డబ్.. లవ్ డబ్.. డబ్ డబ్ డబ్... చక్కనైన ఓ చిరుగాలి... ఒక్క మాట వినిపోవాలి! తెలుగు చిత్రాలే కాదు... ప్రేమ నేపథ్యంలో వచ్చిన అనువాదాలూ అదరగొట్టాయి. అందులో ముఖ్యమైనది ‘ప్రేమ సాగరం’. యువ తమిళ హీరో శింబు తండ్రి టి. రాజేందర్ ముఖ్య పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘ఉయిరుళ్ల వరై ఉష’. ఈ చిత్రమే ‘ప్రేమ సాగరం’ పేరుతో తెలుగులో విడుదలైంది. కాలేజీలో చదువుకుంటూ హీరో, హీరోయిన్ లవ్‌లో పడతారు. హీరోయిన్ అన్నయ్య వీళ్ల ప్రేమకు విలన్. చివరికి ప్రేమికులిద్దరూ ఎలా కలిశారు? అనే పాయింట్‌తో తీసిన సినిమా ఇది. ‘అందాలొలికే సుందరి రాత్రి..’, ‘హృదయమనే కోవెలలో...’, ‘చక్కనైన ఓ చిరుగాలి..’ వంటి సూపర్ హిట్ సాంగ్స్‌తో సినిమా మంచి మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. అప్పటి ప్రేక్షకులకు ప్రేమ మత్తు ఎక్కించింది. కథానాయిక నళినిని స్టార్‌ని చేసిన సినిమా ఈ ‘ప్రేమ సాగరం’. ‘అల్లరి వెన్నెల జల్లులు...’ ఎనభైలలో వచ్చిన ఘాటు ప్రేమకథల్లో ‘డార్లింగ్ డార్లింగ్’ ఒకటి. ఇందులో కె. భాగ్యరాజా హీరో. మామూలుగా భాగ్యరాజా చేసే సినిమాలన్నీ కామెడీ టచ్‌తోనే ఉంటాయి. ఈ సినిమాలో ఆ డోస్ తక్కువ ఉంటుంది. భాగ్యరాజాలో మరో యాంగిల్ చూపించిన సినిమా ఇది. చిన్నప్పుడే స్నేహంగా మెలిగిన ఓ అమ్మాయితో ్రపేమలో పడతాడు అబ్బాయి. ఆ అమ్మాయి కుటుంబం ఎక్కడికో వెళ్లిపోతుంది. కానీ, చిన్ని హృదయంలో నాటుకుపోయిన అమ్మాయి బొమ్మ అలా ఉండిపోతుంది. తాను పెరుగుతూ ఆ అమ్మాయి మీద ప్రేమను పెంచేసుకుంటాడు. అమ్మాయి పెద్దింటి పిల్ల. అబ్బాయి పేదవాడు. పెద్దయ్యాక ఊరు తిరిగొచ్చే ఆ అమ్మాయితో తన ప్రేమను చెప్పాలనుకుంటాడు. అమ్మాయి మాత్రం పనివాడిలానే చూస్తుంది. అక్కణ్ణుంచి అతను పడే నరక యాతన చూసేవాళ్ల హృదయాలను మెలిపెడుతుంది. భాగ్యరాజానే డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సుమన్ నెగటివ్ టచ్ ఉన్న పాత్ర చేశారు. ఎంత పెద్ద విలన్ అయినా ప్రేమ ముందు ఓడిపోవాల్సిందే. చివరికి ప్రేమ గెలుస్తుంది. అందరి మనసులకూ దగ్గరై ‘డార్లింగ్’ అనిపించుకుందీ సినిమా. ఇందులో ఉన్న ‘ఓ చెలీ ఈ నా భావగీతాలే.. కదలాడే నీటిపై తేలు దీపాలే...’, ‘అల్లరి వెన్నెల జల్లులు..’ అనే హిట్ సాంగ్స్‌ని మరచిపోవడం అంత సులువు కాదు. ‘హృదయమా.. హృదయమా..నీ మౌనమెంత వేదన... ఓ మెడికో తన జీవితాంతం ప్రేమను చెప్పలేక సతమతమయ్యి, చివరకు గుండెపోటుతో చచ్చిపోయే వినూత్నమైన కథతో వచ్చిన సినిమా ‘ఇదయం’. ఈ సినిమా ‘హృదయం’ పేరుతో తెలుగులో విడుదలైంది. ప్రేమకథా చిత్రాల్లో ‘హృదయం’ది ప్రత్యేకమైన స్థానం. సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకుల మనసులలో హీరో తన ప్రేమను హీరోయిన్ దగ్గర త్వరగా చెబితే బాగుండు అనే భావన కలుగుతుంది. హీరో మురళి అద్భుతంగా నటించారు. హీరోయిన్ హీరా రూపం మనసులో అలా నిలిచిపోతుంది. ‘ఊసులాడే ఒక జాబిలమ్మ... సిరిమువ్వలుగా నన్ను తాకెనా..’, ‘హృదయమా.. హృదయమా.. నీ మౌనమెంత వేదన...’ పాటలు ఎవర్గ్రీన్. ఈ ‘హృదయం’ ప్రేమ హృదయాలను మీటింది. ఓ చెలియా.. నా ప్రియ సఖియా ‘పేటా ర్యాప్..’, ‘ముక్కాలా.. ముక్కాబులా.. లైలా..’, ‘ఓ చెలియా.. నా ప్రియ సఖియా..’ 1990లలో విడుదలైన ‘కాదలన్’లోని ఈ పాటలు ఇప్పటికీ కొత్తగా ఉంటాయి. అదే సినిమాలో ‘ఊర్వశీ.. ఊర్వశీ..’ కూడా సూపర్ హిట్. సినిమా సూపర్ డూపర్ హిట్. ప్రేమ మహిమ అలాంటిది మరి. హీరోది మధ్యతరగతి కుటుంబం. హీరోయిన్ గవర్నర్ కూతురు. అందనంత ఎత్తు. ప్రేమకు తేడా తెలియదు కదా. కుర్రాడు చిన్నదాని మీద మనసు పారేసుకుంటాడు. పంజరంలో చిలకలా బతుకున్న చిన్నదానికి కుర్రాడు స్వేచ్ఛాప్రపంచాన్ని చూపిస్తాడు. తనూ ప్రేమలో పడుతుంది. గవర్నర్ మనసు ఊరుకుంటుందా? అబ్బాయిని జైల్లో పెట్టించి, చిత్రహింసలు పెట్టిస్తాడు. అయినా ప్రేమికుడు గెలుస్తాడు. ప్రేయసిని తనదాన్ని చేసుకుంటాడు. ఈ సినిమాలో ప్రభుదేవా, నగ్మా కెమిస్ట్రీ బాగుంటుంది. దర్శకుడు శంకర్ తీసిన ఈ లవ్‌స్టోరీ చాలా సై్టలిష్‌గా ఉంటుంది, ‘ప్రేమికుడు’ పేరుతో విడుదలై, ఇక్కడ కూడా ఘనవిజయం సాధించింది. ఉరికే చిలకా... ఆమె ముస్లిమ్.. అతను హిందు. ప్రేమకు కులమతాలతో పని లేదు. ఇద్దరూ ప్రేమలో పడతారు. పెద్దలను ఒప్పించడం కష్టమని తెలుసు.. అందుకే ఇద్దరూ వెళ్లిపోయి, పెళ్లి చేసుకుంటారు. బొంబాయి వెళ్లిపోతారు. కాపురం హాయిగా సాగుతుంది. ఇద్దరు బిడ్డలకు తల్లిదండ్రులవుతారు. ఉన్నట్టుండి మత ఘర్షణలు మొదలువతాయి. హిందువులు–ముస్లిమ్‌ల మధ్య చంపుకునేంత ద్వేషం. పెద్ద పెద్ద అల్లర్లు. ఈ అల్లర్లో పిల్లలు గల్లంతు. పిచ్చి పట్టినట్లు పిల్లల కోసం వెతుకుతారు. చివరికి దొరుకుతారు. కాపాడింది వేరే మతం వాళ్లు. అదే సమయంలో ఇద్దరి కుటుంబాలకు సంబంధించిన పెద్దవాళ్లు వీళ్లను వెతుక్కుంటూ బొంబాయి వస్తారు. వాళ్లకూ కనువిప్పు అవుతుంది. ఒక లవ్‌స్టోరీకి సామాజిక అంశాన్ని ముడిపెట్టి తీయడం మణిరత్నంలాంటి కొంతమంది దర్శకులకు మాత్రమే కుదురుతుందేమో. ఈ సినిమాలో ‘ఉరికే చిలకా వేచి ఉన్నాను నీ కొరకు...’, ‘కన్నానులే...’, ‘అది అరబిక్ కడలందం...’ వంటి ఎ.ఆర్. రహమాన్ పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇక, అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా జంట పండించిన కెమిస్ట్రీని కూడా మరచిపోలేం. పిచ్చి ప్రేమ! పెళ్లికి ముందు భార్య ఒక వ్యక్తిని ప్రేమించిందని తెలిస్తే చాలామంది భర్తలు విడాకులు ఇచ్చేస్తారు. కానీ, తన భార్య మాజీ ప్రియుడికి పిచ్చి పట్టిందని తెలిసి, అతన్ని తీసుకొచ్చి చికిత్స చేయించే భర్త ఉంటాడా? తమిళనాడులో ఉన్నాడు. ఆ సంఘటన తెలిసి, దర్శకుడు బాలాజీ శక్తివేల్ సినిమాగా తీశారు. అదే ‘కాదల్’. భరత్, సంధ్య జంటగా నటించిన ఈ సినిమా తెలుగులో ‘ప్రేమిస్తే’గా విడుదలైంది. ఈ టీనేజ్ లవ్‌స్టోరీ యూత్‌కి బాగా పట్టేసింది. పెద్దవాళ్లకు తెలియకుండా ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకునే టీనేజ్ జంటను ఆ తర్వాత పెద్దవాళ్లే విడదీస్తారు. ఆ తర్వాత అమ్మాయికి పెళ్లి చేసేస్తారు. అబ్బాయి పిచ్చివాడైపోతాడు. ఈ ట్రాజెడీ లవ్‌స్టోరీకి బోల్డన్ని అభినందనలు అందాయి. అప్పటికే భరత్ ‘బాయ్స్’తో పాటు ఓ మూడు సినిమాల్లో నటించాడు. సంధ్యకి ఇది మొదటి సినిమా. ఈ ఒక్క సినిమాతో ఇద్దరికీ ఫుల్ పాపులార్టీ వచ్చేసింది. ప్రేమ పరీక్షలో... ఓ రోజు ఓ నిరుపేద విద్యార్థికి గొప్ప కాలేజీలో సీటొస్తుంది. గొప్పింటి అమ్మాయి మనసులో చోటూ దక్కింది. ఆ తర్వాతే జీవితంలో అసలైన సంఘర్షణ మొదలైంది. ఎక్కువశాతం ప్రేమకథలు చివరికి సుఖాంతం అవుతాయి. ‘ప్రేమికుల రోజు’లోనూ అంతే. కానీ, కథలో ట్విస్ట్ ఏంటంటే.. కాలేజీలో ఆ కుర్రాడికి సీటిచ్చిన ప్రిన్సిపాలే అమ్మాయి తండ్రి. ప్రేమ సంగతి గురువుకి చెప్పలేక నిరుపేద విద్యార్థి సంఘర్షణకు లోనయ్యే తీరు ప్రతి ఒక్కరి మనసులనూ మీటింది. చెప్పుకోవాలంటే ఇది మామూలు కథే. కానీ, దర్శకుడు ఖదీర్ కథకు అద్దిన మోడరన్ మెరుగులు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. ఇప్పుడంటే ఈ–మెయిల్స్, చాటింగ్ అందరికీ తెలుసు. పదిహేనేళ్ల క్రితం ఎవరికి తెలుసు? అప్పుడే ఇవన్నీ ఊహించి ఖదీర్ సినిమాలో చూపించారు. మెయిల్లో అమ్మాయి ఫొటో చూసి ప్రేమలో పడడం.. రైల్వే స్టేషన్లో కలుసుకోవడం... సినిమాలో ప్రతిదీ ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. ఈ సినిమాతో ప్రేమలో పడడానికి మరో ముఖ్య కారణం ఏఆర్ రెహమాన్ పాటలు. ‘వాలు కనులదానా..’, ‘దాండియా ఆటలు ఆడ..’, ‘రోజా రోజా..’ పాటలు సూపర్‌హిట్. ఇక, ‘ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని..’ పాట వన్‌సైడ్ లవర్స్ నోట ఇప్పటికీ మార్మోగుతోంది. మనిషికి ఆక్సిజన్ లేకపోతే ఊపిరాడదు. సినిమాకి ప్రేమ కథ లేకపోతే ఊపిరాడదు. ఇది సత్యం. ఇప్పుడైనా. అప్పుడైనా. ఎప్పటికి అయినా.