కుటుంబంతో కలిసి చూడొచ్చు – దర్శకుడు అభిషేక్‌ మహర్షి 

Prem Kumar movie release on August 18th 2023 - Sakshi

‘ప్రేమ్‌ కుమార్‌’ చిత్రం ఆద్యంతం వినోద భరితంగా కుటుంబ సమేతంగా చూసేలా ఉంటుంది. ఈ మూవీలో నేను, నా వైఫ్‌ అతిథి పాత్రల్లో కనిపిస్తాం’’ అని దర్శకుడు అభిషేక్‌ మహర్షి అన్నారు. సంతోష్‌ శోభన్‌ హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్‌ కుమార్‌’. శివ ప్రసాద్‌ పన్నీరు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న రిలీజ్‌ అవుతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు అభిషేక్‌ మహర్షి మాట్లాడుతూ–‘‘కొన్ని సినిమాలకు ఘోస్ట్‌ రైటర్‌గా పని చేశాను. నా దగ్గర ఉన్న ముప్పై కథల్లో ‘ప్రేమ్‌ కుమార్‌’ కథ సెట్‌ అయింది. ‘కుచ్‌ కుచ్‌ హోతా హై, నువ్వే నువ్వే’ సినిమాల స్ఫూర్తితో ఈ కథను రాశాను. సినిమాల్లో పెళ్లి సీన్స్ లో చివర్లో హీరో వచ్చి.. హీరోయిన్స్  పెళ్లి ఆపుతాడు. తర్వాత హీరో, హీరోయిన్లు కలిసిపోతారు. అప్పుడు ఆ పెళ్లి కొడుకు పరిస్థితి ఏంటి? చెప్పేందుకే ‘ప్రేమ్‌ కుమార్‌’ తీశాం. శివ ప్రసాద్‌గారికి సినిమాలపై ఎంతో ష్యాషన్‌ ఉంది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top