ఓటీటీలో 'ప్రతినిధి 2'.. అధికారిక ప్రకటన | Prathinidhi 2 Movie OTT Streaming Date Locked | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'ప్రతినిధి 2'.. అధికారిక ప్రకటన

Sep 23 2024 7:02 PM | Updated on Sep 23 2024 8:13 PM

Prathinidhi 2 Movie OTT Streaming Date Locked

కొన్నేళ్ల గ్యాప్‌ తర్వాత నారా రోహిత్‌ హీరోగా నటించిన సినిమా ‘ప్రతినిధి 2’. పొలిటికల్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. సుమారు పదేళ్ల క్రితం ఆయన నటించిన 'ప్రతినిధి' చిత్రానికి సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మే 10న ఈ చిత్రం విడుదలైంది. అయితే, బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా మిగిలిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.

‘ప్రతినిధి 2’ చిత్రానికి మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించగా.. కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్‌ 27 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాలో  నారా రోహిత్‌తో పాటు సిరీ లెల్ల,సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ ఘోష్, అజయ్, పృధ్వీ రాజ్, రఘుబాబు వంటి వారు నటించారు.

Advertisement
 
Advertisement
Advertisement