హ‌ను-మాన్: తేజ సజ్జా లుక్‌ అదిరిందిగా! | Prashanth Varma Hanu Man First Look Poster Released by Dulqar Salman | Sakshi
Sakshi News home page

Hanu-Man: దుల్కర్‌ సల్మాన్‌ చేతుల మీదుగా హ‌ను-మాన్ ఫ‌స్ట్‌లుక్

Sep 18 2021 12:12 PM | Updated on Sep 18 2021 12:50 PM

Prashanth Varma Hanu Man First Look Poster Released by Dulqar Salman - Sakshi

మొదటి సినిమానే ‘అ!’ వంటి వినూత్న కథతో  తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ఆ తర్వాత కూడా కల్కి, జాంబీరెడ్డి వంటి డిఫ‌రెంట్ జోన‌ర్లనే కథ వస్తువుగా తీసుకున్నాడు. కాగా ఆయన మరోసారి ‘హ‌ను-మాన్’ వంటి వినూత్న కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని మాలయాళ స్టార్‌ హీరో, మహానటి ఫేం దుల్కర్‌ సల్మాన్‌ శనివారం (సెప్టెంబర్‌ 18న)​ విడుదల చేశాడు.

తేజ స‌జ్జ హీరోగా చేస్తున్న ఈ సినిమాని శ్రీ‌మ‌తి చైత‌న్య స‌మ‌ర్ప‌ణ‌లో కె. నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఫస్ట్ గ్లింప్స్ విష‌యానికి వ‌స్తే  ప్రశాంత్ వర్మ హ‌ను-మాన్ చిత్రం కోసం అంజనాద్రి అనే కొత్త, ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించినట్లు తెలుస్తోంది. వీడియోలో తేజ సజ్జా అడవిలో పరిగెత్తడం, జార‌డం, దూకడం, స్లింగ్‌షాట్‌ను షూట్ చేయడం కనిపిస్తుంది. సూపర్ హీరో గట్టిగా భూమిని తాకినప్పుడు..అత‌ని పంచింగ్ పవర్ ఏంటో చూపించారు. సౌండ్ డిజైన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి.

కాగా ఇంతకుముందు రిలీజ్‌ చేసిన `హ‌ను-మాన్` టైటిల్ టీజ‌ర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో జాంబీ రెడ్డి కాంబీనేషన్‌ మ్యాజిక్‌ రిపిట్‌ చేస్తుందని చిత్రబృందం ఆశిస్తోంది ఈ సినిమాని తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ విడుదల చేయనున్నట్లు మూవీ టీం తెలిపింది. అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్‌తో వస్తున్న ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతోంది. అయితే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement