రెండో బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత | Actress Pranitha Subhash Blessed With Baby Boy, Photo Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

రెండో బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత

Sep 5 2024 1:35 PM | Updated on Sep 5 2024 1:40 PM

Pranitha Subhash Blessed Baby Boy

హీరోయిన్‌ ప్రణీత రెండోసారి తల్లయ్యారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటికే ఆమెకు ఆర్నా అనే కూతురు ఉన్న విషయం తెలిసిందే.  ‘అత్తారింటికి దారేది’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన ప్రణీత 2021లో  బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌ రాజుని వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత సినిమాలకు కాస్త ఆమె బ్రేక్‌ ఇచ్చారు.

ప్రణీత కూతురు ఆర్నా తన తమ్ముడిని చూసి 'బేబి' అని పిలుస్తూ తెగ సంబరపడితోంది. మొదటిసారి డెలివరీ సమయంలో ఉన్న కంగారు ప్రస్తుతం తనకు లేదని ప్రణీత తెలిపింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ప్రణితకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ప్రణీత అమ్మగారు గైనకాలజిస్టు అని తెలిసిందే. మొదటి కాన్పు ఆమె ఆసుపత్రిలోనే జరిగింది. ఇప్పుడు కూడా అక్కడే తను రెండో బిడ్డకు జన్మనిచ్చారు. గైనకాలజిస్టుగా ఎంతో అపార అనుభవం ఉన్నా డాక్టర్‌గా ఆమెకు గుర్తింపు ఉంది. నటి ప్రణీత కన్నడ, హిందీ, తమిళం, తెలుగు సినిమాల్లో నటించారు. 2010లో పోక్రీ కన్నడ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement