'కన్నప్ప' కోసం శివుడిగా ప్రభాస్‌.. ఇంత అందంగా ఉన్నాడా! | Prabhas Bhakta Kannappa First Look Viral | Prabhas As Lord Shiva - Sakshi
Sakshi News home page

'కన్నప్ప' కోసం శివుడి రూపంలో ప్రభాస్‌.. ఫోటోలు వైరల్‌

Oct 5 2023 9:18 AM | Updated on Oct 5 2023 9:49 AM

Prabhas Look In Bhakta Kannappa - Sakshi

నటుడు మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్టు ‘కన్నప్ప’ లో శివుడి పాత్రలో ప్రభాస్‌ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దాదాపు అది నిజమేనని సమాచారం. త్వరలో అధికారికంగా ప్రకటన కూడా రావచ్చు. భక్త కన్నప్ప కథతో రూపొందనున్న ఈ చిత్రానికి ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇటీవలే ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కింది. సుమారు  రూ. 100 కోట్లతో  అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఎక్కువ భాగం షూటింగ్ న్యూజిలాండ్‌లో జరగనుంది. షూటింగ్ కోసం ఇప్పటికే 7 కంటైనర్ల సెట్ ప్రాప్స్ న్యూజిలాండ్‌కు రవాణా చేయబడ్డాయి.  

(ఇదీ చదవండి: సినిమాల కోసం రాజీనామా చేసిన IAS.. గతంలో ఈ కలెక్టర్‌ చరిత్ర ఇదే)

ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ నటిస్తాడని చిత్రబృందం పరోక్షంగా ప్రకటించింది.  సినిమాలో కన్నప్ప పాత్ర మినహా మిగిలిన ప్రధాన పాత్రలు చాలా తక్కువ. అందులో కన్నప్ప భక్తిని ఉర్రూతలూగించే శివుడి పాత్ర కూడా ముఖ్యమే. అదే పాత్రలో ప్రభాస్ నటిస్తాడని అంటున్నారు.  ‘ఆదిపురుష’ సినిమాలో శ్రీరాముడి పాత్రలో మెప్పించిన ప్రభాస్‌.. కన్నప్పలో శివుడి రూపంలో  ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడో ఏఐ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెక్నాలజీ సాయంతో శివుడి రూపంలో ప్రభాస్ పోస్టర్లను డిజైన్ చేసి షేర్ చేస్తున్నారు అభిమానులు. శివుడి వేషంలో ప్రభాస్ లుక్ చూసిన వారు సూపర్‌గా ఉన్నాయని షాక్ అవుతున్నారు.

అదేవిధంగా సినిమాలో శివగా ప్రభాస్ పెర్ఫార్మెన్స్ బాగుంటుందని అభిమానులు అంటున్నారు. .'కన్నప్ప'లో శివ పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా, పార్వతిగా నయనతార కనిపించనుందని సమాచారం. ఇప్పటికే రెండు సినిమాల్లో పౌరాణిక పాత్రల్లో ఆమె నటించింది. అదే కారణంతో ఆమెను ఎంపిక చేస్తారని సమచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement