Prabhas, Kamal Haasan Vishwaroopam Success Meet Video Viral - Sakshi
Sakshi News home page

Prabhas Kamal Haasan: అప్పుడు పరిచయం చేసుకున్నాడు.. ఇప్పుడేమో

Jun 25 2023 2:48 PM | Updated on Jun 25 2023 3:46 PM

Prabhas Kamal Haasan Vishwaroopam Success Meet Video - Sakshi

డార్లింగ్ ప్రభాస్.. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కానీ ఇలాంటి ట్రెండ్ ఏం లేనప్పుడే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి వాళ్లు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేశారు. తమ సినిమాలతో ఆకట్టుకున్నారు. అలాంటిది ఇప్పుడు వీళ్ల ముగ్గురు కలిసి 'ప్రాజెక్ట్ K' అనే చిత్రం చేస్తున్నారు. ఇదంతా పక్కనబెడితే ప్రభాస్-కమల్ హాసన్ తో మాట్లాడిన పదేళ్ల క్రితం నాటి వీడియో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. 

(ఇదీ చదవండి: 'ప్రాజెక్ట్ K'లో కమల్‌ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)

సక్సెస్‌కి కేరాఫ్ ప్రభాస్!
'బాహుబలి' ముందు ప్రభాస్ గురించి తెలుగులో మాత్రమే తెలుసు. అలా 2013లో కమల్ హాసన్ 'విశ్వరూపం' సినిమా సక్సెస్ మీట్ కు హాజరయ్యాడు. విలక్షణ నటుడు కమల్ కు తనని తాను ప్రభాస్ అని పరిచయం చేసుకున్నాడు. కట్ చేస్తే.. పదేళ్లలో ఏకంగా ఆయనతోనే 'ప్రాజెక్ట్ K'లో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కొట్టేశాడు. ఆ వీడియోని చూస‍్తున్న డార్లింగ్ ఫ్యాన్స్.. ఇది కదా అసలైన సక్సెస్ అంటే అని తెగ పొగిడేస్తున్నారు. 

ప్రభాస్ మాట్లాడింది ఇదే
'ఆయన(కమల్ హాసన్) సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన పక్కన కూర్చోవడమే నా అదృష్టం. ఆయనకు నేనెవరో తెలియదేమో. ఐ యామ్ ప్రభాస్ సర్. మా జనరేషనే కాదు ఇంకో 10 జనరేషన్లకు కమల్ హాసన్ అవసరం. కమల్ హాసన్ గారికి సినిమాలు ఎంతో అవసరమో తెలియదు గానీ ఇండియాకు ఆయన సినిమాలు చాలా అవసరం' అని ప్రభాస్ మాట్లాడిన పాత వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


(ఇదీ చదవండి: ఓటీటీలోకి మన సూపర్‌హీరో మూవీ.. తెలుగులోనూ!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement