Kamal Haasan Remuneration Project K Movie - Sakshi
Sakshi News home page

Kamal Haasan Remuneration: కమల్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Jun 25 2023 1:37 PM | Updated on Jun 25 2023 3:05 PM

Kamal Haasan Remuneration Project K Movie - Sakshi

ప్రభాస్ 'ఆదిపురుష్'ని ఫ్యాన్స్ నెమ్మదిగా మరిచిపోతున్నారు. 'సలార్' కోసం తెగ ఎదురుచూస్తున్నారు. దీని తర్వాత 'ప్రాజెక్ట్ K' అనే మరో క్రేజీ సినిమా లైన్ లో ఉంది. ఇందులో కమల్ హాసన్ నటిస్తున్నారని నిర్మాతలు అధికారికంగా ప్రకటించి, ఓ వీడియోని రిలీజ్ చేశారు. కీలక పాత్రలో కనిపిస్తారని చెప్పుకొచ్చారు. అలానే ఆ రోల్ కోసం ఆయన తీసుకుంటున్న రెమ‍్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

అలాంటి రోల్‌లో? 
'విశ్వరూపం'తో ప్రేక్షకుల్ని అలరించిన కమల్ హాసన్.. ఆ తర‍్వాత పలు సినిమాలు చేసినప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో హిట్ కొట్టలేకపోయారు. 'విక్రమ్'తో మాత్రం కెరీర్ లో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం 'ఇండియన్ 2' (భారతీయుడు 2) సినిమాతో బిజీగా ఉన్న కమల్.. ప్రభాస్ 'ప్రాజెక్ట్ K'లోనూ నటిస్తున్నట్లు ఖరారైంది. ఇందులో ప్రభాస్ కి విలన్ గా ఈయన చేయబోతున్నారని సమాచారం.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మన సూపర్‌హీరో మూవీ.. తెలుగులోనూ!)

అన్ని కోట్లు రెమ్యునరేషన్?
'ప్రాజెక్ట్ K' కోసం హీరో ప్రభాస్ కి రూ.150 కోట్ల వరకు ఇస్తున్నారని టాక్. ఇప్పుడు ఇదే సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న కమల్ కి రూ.100 కోట్లకు పైనే రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం కెరీర్ లోనే కమల్ తీసుకోబోయే అత్యధిక పారితోషికం ఇదవుతుంది. ఇందులో నిజమెంతనేది స్పష‍్టత రావాల్సి ఉంది.

'ప్రాజెక్ట్ K' రిలీజ్ వాయిదా
ప్రభాస్ 'ప్రాజెక్ట్ K'ని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయబోతున్నట్లు కొన్నాళ్ల ముందు ప్రకటించారు. ఇప్పుడు కమల్ ని కన్ఫర్మ్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలో మాత్రం ఆ తేదీ లేదు. దీంతో విడుదల వాయిదా పడినట్లే అని తెలుస్తోంది. వైజయంతీ మూవీస్ కి అచ్చొచ్చిన మే 9న.. ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి.

(ఇదీ చదవండి: పెద్ద కూతురి కోసం చిరంజీవి సంచలన నిర్ణయం!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement