మీరనుకున్నట్లు శ్రీదేవి అమాయకురాలు కాదు: సీనియర్ నటి పూనమ్ | Poonam Dhillon spoke about late actor Sridevi image in media | Sakshi
Sakshi News home page

Poonam Dhillon: శ్రీదేవితో పనిచేశా.. తన గురించి నాకు బాగా తెలుసు: పూనమ్ ధిల్లాన్

Jun 30 2025 7:30 PM | Updated on Jun 30 2025 9:02 PM

Poonam Dhillon spoke about late actor Sridevi image in media

టాలీవుడ్ ప్రియుల గుండెల్లో అతిలోక సుందరిగా ముద్రవేసుకున్న హీరోయిన్ శ్రీదేవి. బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ స్టార్‌ హీరోయిన్‌గా మెప్పించింది. తాజాగా ఆమెపై మరో నటి, హీరోయిన్ పూనమ్ ధిల్లాన్‌ ప్రశంసలు కురిపించారు. అందరూ అనుకున్నట్లుగా తానేమీ తెలివితక్కువ వ్యక్తి కాదని తెలిపింది. తను చాలా అందమైన, అద్భుతమైన మనిషి అని అన్నారు. మీడియాలో చూపినట్లుగా మాటలు రాని వ్యక్తి కాదని పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నటి పూనమ్ ధిల్లాన్‌.. శ్రీదేవిని ఉద్దేశించి ఇలా కామెంట్స్ చేశారు.

నటి పూనమ్ ధిల్లాన్ మాట్లాడుతూ.. 'శ్రీదేవి చాలా తెలివైన నటి. మీడియా ఆమెను మాటలు రాని వ్యక్తిగా ముద్ర వేసింది. కానీ ఆమె అంత తెలివైనది కాదు. తనను అమాయకురాలిగా ముద్ర వేయడం అదంతా ఒక కుట్ర అని నేను చెప్తున్నా. ఎందుకంటే ఆమె చాలా తెలివిగల అమ్మాయి. అలా కాకపోతే ఆమె అంత అద్భుతమైన నటి ఎలా అవుతుంది? అందుకే శ్రీదేవి అమాయకురాలిగా నమ్మడాన్ని నిరాకరిస్తున్నా. నేను ఎల్లప్పుడూ ఆమె పనిని ఆరాధించేదాన్ని. తనతో కలిసి రెండు చిత్రాలలో పనిచేశా. శ్రీదేవి చాలా నిగ్రహం కలిగిన వ్యక్తి.' అని పంచుకుంది. కాగా.. శ్రీదేవి, పూనమ్ ధిల్లాన్ 'సోనే పే సుహాగా', 'జుదాయి' వంటి చిత్రాల్లో కలిసి పనిచేశారు.

ఇక సినిమాల విషయానికొస్తే నటి పూనమ్ ధిల్లాన్ చివరిసారిగా రితేష్ దేశ్‌ముఖ్, తమన్నా భాటియా నటించిన 'ప్లాన్ ఎ ప్లాన్ బి'లో కనిపించింది. ఆమె జియో హాట్‌స్టార్ షో 'దిల్ బెకరార్'లో కూడా కనిపించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement