Pooja Hegde In F3 Movie: పూజా హెగ్డె ఐటమ్‌ సాంగ్‌ షురూ.. ఇక మరింత ఫన్‌

Pooja Hegde Begins Special Song Shooting In F3 Movie - Sakshi

Pooja Hegde F3 Movie Item Song Starts: ఇటు టాలీవుడ్‌, అటు కోలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. సుమారు స్టార్‌ హీరోలందరితోనూ ఆడిపాడుతూ మోస్ట్‌ బిజియెస్ట్‌ హీరోయిన్‌గా మారింది ఈ బ్యూటీ. ఇటీవల 'అరబిక్‌ కుతు' సాంగ్‌లో విజయ్‌తో కలిసి అదరగొట్టింది. ఆ సాంగ్ ఎంత పాపులర్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా 'రంగస్థలం' సినిమాలో 'జిగేల్ రాణి'గా జిగేలుమనిపించింది. ఇదిలా ఉంటే తాజాగా వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ల మల్టీస్టారర్‌ 'ఎఫ్‌ 3' సినిమాలో పూజా స్పెషల్‌ సాంగ్‌ చేయనుంది. ఈ పాట చిత్రీకరణను శుక్రవారం (ఏప్రిల్‌ 15) న ప్రారంభించారు. 

అన్నపూర్ణ స్టూడియోలో సుమారు 7 ఎకరాల్లో వేసిన అద్భుతమైన సెట్‌లో ఈ పార్టీ నెంబర్‌ను షూట్‌ చేయనున్నారు. శుక్రవారం నుంచి ఈ పాట చిత్రీకరణ మొదలైంది. ఈ సాంగ్‌లో పూజా హెగ్డేతోపాటు సినిమాలోని హీరోహీరోయిన్లు కూడా ఆడిపాడనున్నారట. ఒకే స్క్రీన్‌పై బుట్టబొమ్మ, వెంకటేష్, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహ్రీరన్‌ పిర్జాదా, సోనాల్‌ చౌహన్‌ కనిపించడం నిజంగా ఫన్‌గానే ఉండనుంది. ఈ పాటను రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ కంపోజ్‌ చేశారు. దిల్‌ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శిరీష్‌ నిర్మిస్తున్నారు. 'ఎఫ్‌ 3' చిత్రం నవ్వులు పూయించడానికి మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

చదవండి: ఆ స్టార్‌ హీరోను 'ఆంటీ' అంటానంటున్న పూజా హెగ్డే

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top