ప్రముఖ సింగర్‌కు ప్రధాని మోదీ లేఖ.. సోషల్ మీడియాలో వైరల్

PM Modi Wishes To Bollywood Singer Palak Muchhal Marriage - Sakshi

బాలీవుడ్‌ సింగర్‌ పాలక్‌ ముచ్చల్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ మిథూన్‌ శర్మ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కొన్నేళ్లుగా ప్రేమలో మునిగితేలిన వీరద్దరూ మూడుముళ్ల బంధంతో రెండు రోజుల క్రితమే ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ముచ్చల్. ఈ జంట వివాహానికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. పలువురు సినీతారలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. 

(చదవండి: మ్యూజిక్‌ డైరెక్టర్‌ను పెళ్లాడిన ప్రముఖ సింగర్‌.. ఫోటోలు వైరల్‌)

తాజాగా ఈ ప్రేమజంటకు ప్రధాని మోదీ సైతం శుభాకాంక్షలు తెలిపారు. పాలక్‌ ముచ్చల్‌ను కంగ్రాట్స్ చెబుతూ ఓ లేఖను విడుదల చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ పాలక్ ముచ్చల్‌ ట్వీట్ చేశారు. మోదీ లేఖపై ఆమె స్పందిస్తూ..' మీ ఆశీర్వాద లేఖ మా హృదయాలను తాకింది. మా పట్ల మీ ప్రేమ, గౌరవానికి కృతజ్ఞతలు. ఈ శుభ సందర్భంలో మీ ఆశీస్సులు పొందడం మాకు చాలా విశేషం.' అంటూ రాసుకొచ్చింది. కాగా పాలక్‌ ఏక్‌ థా టైగర్‌’ ‘అషికీ–2’ ‘యం.ఎస్‌ ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ వంటి సినిమాల్లో పాటలు పాడిన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top